Hyderabad: దమ్ముంటే మీరూ పోరాడండి.. మంత్రి కేటీఆర్‌కు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్.
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. ముస్లింలు మజ్లిస్‌కు మాత్రమే ఓటు వేస్తారా.? మాకు వేయరా.? అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే వచ్చి పోరాడాలని, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అసదుద్దీన్ ఛాలెంజ్ విసిరారు...
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. ముస్లింలు మజ్లిస్‌కు మాత్రమే ఓటు వేస్తారా.? మాకు వేయరా.? అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే వచ్చి పోరాడాలని, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అసదుద్దీన్ ఛాలెంజ్ విసిరారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్న అసదుద్దీన్.. తమపై విమర్శలు చేస్తే అభ్యంతరం లేదన్నారు. తాము ఒక సారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
ఇక ఓట్ల విషయంపైనా అంతే ఘూటుగా స్పందించిన ఓవైసీ తమ పార్టీ నిర్ణయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘ఓవైసీ చెబితేనే ఓట్లు వేస్తారా అని అడుగుతున్నారు. మీరు కూడా ఓట్లు వేయించుకోండి..ఎవరొద్దన్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. మా అభ్యర్థులపై పోటీ చేసి గెలవండి చూద్దాం. గుర్రమూ..గ్రౌండూ అన్నీ సిద్ధంగా ఉన్నాయి’ అని సవాల్ విసిరారు.
పోటీ విషయంలోనూ తగ్గేదేలే..
ఇక పోటీ విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు ఓవైసీ. హైదరాబాద్‌లో తనపై పోటీ చేయాలని, నేనూ మీ ప్రాంతాల్లో పోటీకి సిద్ధమని సవాల్ విసిరారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగుండదన్న ఓవైసీ ఆ తర్వాత మళ్లీ ఏడుస్తూ నా దగ్గరికి రావొద్దంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..