AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అసలోడు వాడుకాదు వీడు.. అలా తప్పించుకుని ఇలా దొరికాడు.. కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం

Drug Mafia: రాయదుర్గం డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ వినియోగదారుడని వదిలేసిన వ్యక్తే ప్రధాన సూత్రదారుడని తేలింది. నెల తర్వాత అసలు విషయాన్ని గుర్తించిన ఎస్‌వోటీ పోలీసులు.. వెలగపూడి రఘుతేజకు నోటీసులు ఇచ్చారు...మరో అయిదుగురిని అరెస్ట్‌ చేశారు. ఇంతకీ.. ఎవరీ వెలగపూడి రఘుతేజ?.. అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి?...

Hyderabad: అసలోడు వాడుకాదు వీడు.. అలా తప్పించుకుని ఇలా దొరికాడు.. కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం
Dugs
Sanjay Kasula
|

Updated on: Jun 09, 2023 | 7:53 AM

Share

హైదరాబాద్, జూన్ 09: తెలంగాణను డ్రగ్స్ ప్రీ రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎంతగానో కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌వోటీ పోలీసులు డ్రగ్స్, గంజాయి, హాష్ ఆయిల్ లాంటి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఆట కట్టిస్తున్నారు. అయితే.. కొన్ని ముఠాలు విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ కేంద్రం విక్రయాలు సాగిస్తున్నాయి. కాలేజ్ విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ సఫ్లై చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరాపై నిఘా పెట్టిన పోలీసులు.. నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెుత్తం నలుగురిని అరెస్ట్ చేయగా.. ఒకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి కోట్ల రూపాయల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు ఎస్‌వోటీ పోలీసులు .

అయితే.. ఈ కేసులో వెలగపూడి రఘుతేజకు డ్రగ్స్ సరఫరా చేయటంలో చింతా రాకేష్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. గోవా నుంచి కొకైన్ తెచ్చి హైదరాబాద్‌లో సప్లై చేస్తున్నట్లు తెలిపారు. చింతా రాకేష్ మొదటగా డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాడని.. అందులో నష్టం రావటంతో సులభంగా డబ్బులు సంపాదించాలని డ్రగ్స్ దందా మెుదలు పెట్టినట్లు చెప్పారు. మరికొంత కూపీ లాగగా.. గోవాలో ఏడు వేలతో కొకైన్ కొనుగోలు చేసి దాన్ని హైదరాబాద్‌లో 18 వేలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 1.33 కోట్ల విలువైన 303 గ్రామ్స్ కొకైన్, రెండు కార్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

ఇక.. వెలగపూడి రఘుతేజ.. గతంలో ఇన్ఫినిటీ ఫుడ్ అండ్ డ్రైవ్ ఇన్ హోటల్ అనే వ్యక్తి నడిపేవాడు. అయితే.. కొద్దిరోజుల క్రితం డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు దాడి చేయటంతో వెలగపూడి రఘుతేజ పట్టుబడ్డాడు. అయితే.. అతను డ్రగ్స్ వినియోగదారుడని భావించి పోలీసులు వదిలిపెట్టారు. తాజాగా వెలగపూడి రఘుతేజనే డ్రగ్స్ విక్రయదారుడని తెలిసి ఎస్వోటీ పోలీసులు అతన్ని, మరో అయిదుగురిని పట్టుకున్నారు. విచారణలో రఘుతేజ రెండేళ్లుగా ఫ్లైట్‌లలో గోవా వెళ్లి కొకైన్ కొని బస్సుల్లో తెచ్చి అమ్ముతున్నట్టుగా ఒప్పుకున్నాడు. అతని నుంచి కొకైన్ కొంటున్నవారిలో పెద్దపెద్ద సెలెబ్రేటీలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం వెలగపూడి రఘుతేజను అదుపులోకి తీసుకోవడంతో కొందరిలో కలవరం రేగుతోంది.

తాజాగా రఘు తేజనే డ్రగ్స్ విక్రయందారు అని తెలిసి ఎస్వోటీ పోలీసులు అతన్ని, మరో అయిదుగురిని పట్టుకున్నారు. విచారణలో రఘు తేజ రెండేళ్లుగా ఫ్లైట్‌లలో గోవా వెళ్లి కొకైన్ కొని బస్సుల్లో ఇక్కడికి తెచ్చి అమ్ముతున్నట్టుగా వెళ్లడయ్యింది. ఇతని నుంచి కొకైన్ కొంటున్నవారిలో పెద్ద పెద్ద సెలెబ్రేటీలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రఘు తేజను అదుపులోకి తీసుకోవడంతో వీరిలో కలవరం వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది.

డగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరాపై నిఘా పెట్టిన పోలీసులు.. నిందుతులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెుత్తం నలుగురిని అరెస్ట్ చేయగా.. ఒకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి కోట్ల రూపాయల విలువైన కొకైన్‌ను ఎస్‌వోటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..