Azharuddin: హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్ కేసు.. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు అజహరుద్దీన్.. విచారణ ఎప్పుడంటే?
ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ చేశారనే ఆరోపణలతో హెచ్‌సీఏ మాజీ చీఫ్ అజారుద్దీన్ చిక్కుల్లో పడుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో జిమ్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్లు, క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్ కొనుగోళ్లలో నిధుల గోల్‌మాల్ జరిగిందని ఆరోపిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో సునీల్.. ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు.. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి కోట్ల రూపాయల నిధులు కట్టబెట్టారంటూ..
నిధుల గోల్‌మాల్ కేసులో మల్కాజ్‌గిరి కోర్టును ఆశ్రయించారు హెచ్‌సీఏ మాజీ చీఫ్ అజారుద్దీన్. హెచ్‌సీఏలో నిధుల గోల్‌మాల్ కేసులో అజారుద్దీన్‌పై ఉప్పల్ పీఎస్‌లో నాలుగు కేసులు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు అజారుద్దీన్. బెయిల్ పిటిషన్‌పై నవంబర్ 1న మల్కాజ్‌గిరి కోర్టు విచారణ చేపట్టనుంది. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ చేశారనే ఆరోపణలతో హెచ్‌సీఏ మాజీ చీఫ్ అజారుద్దీన్ చిక్కుల్లో పడుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో జిమ్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్లు, క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్ కొనుగోళ్లలో నిధుల గోల్‌మాల్ జరిగిందని ఆరోపిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో సునీల్.. ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు.. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి కోట్ల రూపాయల నిధులు కట్టబెట్టారంటూ అజారుద్దీన్‌పై జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఫిర్యాదు చేసింది. క్రికెట్ బాల్స్ కొనుగోలులో భారీ గోల్‌మాల్ జరిగినట్లు నివేదికలో తెలిపింది కమిటీ. ఒక్కో బాల్‌కు 392రూపాయలకు బదులు 1400లకు వర్క్ ఆర్డర్ ఇచ్చినట్లు గుర్తించారు. కేవలం బాల్స్ కొనుగోలు పేరుతోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు 57 లక్షలు, బకెట్ కుర్చీల గోల్‌మాల్‌తో మరో 43 లక్షలు, ఫైర్ ఫైటింగ్ పరికరాల పేరుతో కోటి 50లక్షలు, జిమ్ పరికరాల పేరుతో మరో కోటి 53 లక్షలు నష్టం చేకూరిందని కమిటీ నివేదికలో తెలిపింది.
హెచ్‌సీఏ టెండర్ల కేటాయింపుల్లో కోట్లలో అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలింది. ప్రధానంగా.. 2020 నుండి 2023 వరకు HCAకు బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు, ఖర్చు చేసిన విధానం, టెండర్లు, కొటేషన్లపై ఫోరెన్సిక్ ఆడిట్‌లో అవకతవకలు గుర్తించింది కమిటీ. ఆగష్టు 10న హెచ్‌సీఏ నిధులపై ఆడిట్ చేశారు జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ. దాంతో.. ఉప్పల్ పీఎస్‌లో అజారుద్దీన్‌పై వివిధ సెక్షన్ల కింద నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులు నమోదు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన అజారుద్దీన్.. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ వేశారు. 2019-2022 మధ్య హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఉన్నారు. ఆ మూడేళ్ల కాలంలో నిధుల దుర్వినియోగంపై అనేక ఆరోపణలు వచ్చాయి. దాంతో.. అసోసియేషన్‌ను గాడిలో పెట్టేందుకు సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు సింగిల్ మెంబర్ కమిటీ ఫోరెన్సిక్ ఆడిట్చేయించగా, నిధుల గోల్‌మాల్ వ్యవహారం బయటపడింది. మొత్తంగా.. హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మల్కాజ్‌గిరి కోర్టులో అజారుద్దీన్ పిటిషన్ వేశారు. నవంబర్ 1న బెయిల్ పిటిషన్‌పై మల్కాజ్‌గిరి కోర్టులో విచారణ జరగనుంది. మొత్తంగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అజారుద్దీన్‌ను హెచ్‌సీఏ కేసులు వెంటాడుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చేయండి..