సినీ పెద్దలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ

కరోనా వలన ఆగిపోయిన సినిమా షూటింగ్‌లకు సంబంధించి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సినిమా, టీవీ చిత్రీకరణల కోసం కొన్ని మార్గదర్శకాలను

సినీ పెద్దలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ
Srinivas Goud
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 24, 2020 | 5:32 PM

Minister srinivas goud: కరోనా వలన ఆగిపోయిన సినిమా షూటింగ్‌లకు సంబంధించి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సినిమా, టీవీ చిత్రీకరణల కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, సినీ పెద్దలతో ఫిల్మ్ ఛాంబర్‌లో భేటీ అయ్యారు. టూరిజం ప్రదేశాల్లో సినిమా షూటింగ్‌లపై వారితో ఆయన చర్చించారు. ఈ భేటీలో నిర్మాతలు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”షూటింగ్‌ చేసుకునేందుకు తెలంగాణలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఆదిలాబాద్, వికారాబాద్, కుంత‌లా, భోగ‌తా జ‌ల‌పాతాలు ఇలా దాదాపు 50-60 లొకేష‌న్లు ఉన్నాయి. ఇక్క‌డ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామ‌ని నిర్మాతలు ముందుకొస్తున్నారు. తెలంగాణ‌లో షూటింగ్స్‌కి సంబంధించిన నివేదిక‌ను 15 రోజుల్లో సీఎం కేసీఆర్‌కు అందిస్తాం” అని  తెలిపారు. కాగా కరోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ప్రభుత్వం జూన్‌లోనే సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు అనుమతిని ఇచ్చింది. దీంతో సీరియళ్లతో పాటు కొన్ని షోలు, వెబ్ సిరీస్‌లు, చిన్న సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి.

Read More:

రియా వచ్చినప్పటి నుంచి మేమిద్దరం పెద్దగా మాట్లాడుకోలేదు

విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం