Breaking News : వర్మకు మరో షాక్… ‘మర్డర్’ సినిమాకు బ్రేక్
వర్మకు మరో షాక్ తగిలింది. ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమాకు బ్రేక్ పడింది. రెండేళ్ల క్రితం నల్లగొండ జిల్ల మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుని..
వర్మకు మరో షాక్ తగిలింది. ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమాకు బ్రేక్ పడింది. రెండేళ్ల క్రితం నల్లగొండ జిల్ల మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుని హత్య ఆధారంగా మర్డర్ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రణయ్ భార్య అమృత నల్లగొండ జిల్లా కోర్టును ఆశ్రయించింది. తమ అనుమతి లేకుండా… తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటూ సినిమా నిర్మించడాన్ని నిరసిస్తూ అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపి ఎస్సీ, ఎస్టీ కోర్టు కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మర్డర్ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు అయ్యింది.