విదేశీ యువతిపై దొంగ స్వామిజీ అత్యాచారయత్నం

త‌మిళ‌నాడులో దారుణం చోటుచేసుకుంది. తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులో ఉంటున్న అమెరికా మ‌హిళ‌పై ఓ స్వామీజీ అత్యాచారయ‌త్నం చేశాడు.

విదేశీ యువతిపై దొంగ స్వామిజీ అత్యాచారయత్నం
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 24, 2020 | 3:17 PM

త‌మిళ‌నాడులో దారుణం చోటుచేసుకుంది. తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులో ఉంటున్న అమెరికా మ‌హిళ‌పై ఓ స్వామిజీ అత్యాచారయ‌త్నం చేశాడు. దీంతో స్థానికులు అతడిని చిత‌క‌బాది పోలీసులకు అప్పగించారు. వివ‌రాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన మ‌హిళ‌(31) ఐదు నెలల క్రితం తిరువణ్ణామలై వచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా తిరిగి వెళ్లే అవ‌కాశం లేక‌పోవ‌డంతో తిరువణ్ణామలైలోని అరుణాచలనగర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్క‌డే ఉంటుంది. ఈ ఏరియాలో స్వామిజీలు, సాధువులు ఎక్కువగా ఉంటారు. నామకల్‌ జిల్లా తిరుమలై పట్టి గ్రామానికి చెందిన మణిగండన్‌(41) కూడా స్వామిజీగా మారి అదే ఏరియాలో ఉంటున్నాడు.

అయితే ఆ అమెరిక‌న్ మ‌హిళ టైమ్ పాస్ కోసం త‌ర‌చూ ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చేది. ఆదివారం ఉదయం ఇంటిలో ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించిన స్వామిజీ మణిగండన్‌ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె గ‌ట్టిగా కేక‌లు వేయడంతో పాటు ఇంటిలో ఉన్న కత్తితో త‌న‌ను తాను కాపాడుకోవ‌డానికి మణిగండన్‌పై దాడి చేసింది. అరుపులు విని అక్క‌డికి చేరుకున్న‌ స్థానికులు అక్కడికి చేరుకొని మణిగండన్‌ను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Also Read :

ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా‌ కరోనా పాజిటివ్‌

వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన స‌ర్కార్