వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన స‌ర్కార్

వైఎస్సార్‌ ఆసరా స్కీమ్ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు ఏపీ స‌ర్కార్ ఇచ్చే డబ్బును బ్యాంకులు లబ్ధిదారుల సమ్మ‌తి లేకుండా, సంఘం లేదా సంబంధిత మహిళల వ్యక్తిగత అప్పులకు జమ చేసుకోవడానికి వీల్లేదని గ‌వ‌ర్న‌మెంట్ తేల్చి చెప్పింది.

వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన స‌ర్కార్
Follow us

|

Updated on: Aug 24, 2020 | 9:48 AM

వైఎస్సార్‌ ఆసరా స్కీమ్ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు ఏపీ స‌ర్కార్ ఇచ్చే డబ్బును బ్యాంకులు లబ్ధిదారుల సమ్మ‌తి లేకుండా, సంఘం లేదా సంబంధిత మహిళల వ్యక్తిగత అప్పులకు జమ చేసుకోవడానికి వీల్లేదని గ‌వ‌ర్న‌మెంట్ తేల్చి చెప్పింది. పొదుపు సంఘాల‌ మహిళలు ఆ డబ్బును ఏ అవసరాలకైనా ఉప‌యోగించుకోవ‌చ్చున‌ని, ఎటువంటి ఆంక్షలు ఉండవని కూడా వెల్ల‌డించింది. ఈ మేరకు వైఎస్సార్‌ ఆసరా స్కీమ్ విధివిధానాలను పొందుప‌రుస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

బ్యాంకు లింకేజీ రుణాలను 4 విడతల్లో చెల్లించేందుకు గ‌వ‌ర్న‌మెంట్ రెడీ అయ్యింది. 2019 ఏప్రిల్ 11 తేదీ వరకు పెండింగ్​లో ఉన్న బ్యాంకు లింకేజీ లోన్స్‌కు మాత్రమే ఈ వైఎస్​ఆర్ ఆసరా స్కీమ్ వర్తిస్తుందని ఏపీ స‌ర్కార్ తెలిపింది. 2019 ఏప్రిల్‌ 11 నాటికి ఏదైనా సంఘాన్ని బ్యాంకు ఎన్‌పీఏగా గుర్తించి ఉంటే అలాంటి సంఘాలకు ఈ స్కీమ్ వర్తించదు.

వైఎస్సార్‌ ఆసరా ప‌థ‌కం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల ప్రైమ‌రీ లిస్ట్‌ల‌ను ఈనెల 25న అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచనున్నట్టు సెర్ప్‌ సీఈవో తెలిపారు. అర్హత ఉండీ ఆ లిస్ట్‌లో పేరు లేని వారి నుంచి కంప్లైంటుల‌ స్వీకరణకు సెర్ప్, మెప్మాలు జిల్లా స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని గ‌వ‌ర్న‌మెంట్ ఆదేశించింది. సెర్ప్‌, మెప్మా హెడ్ ఆఫీస్‌లు, స్పందన కాల్‌ సెంటర్‌లోనూ ఫిర్యాదులు స్వీకరించనున్నారు. కాగా సెప్టెంబర్‌ 11న వైఎస్సార్‌ ఆసరా స్కీమ్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ ప్రకటించారు.

Also Read :

పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రైవేటు సంస్థ‌ల‌ చేతికి !

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో