ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా

ఎస్పీ బాలు ఆసుపత్రిలో కరోనాతో పోరాటం చేయడం కలచి వేస్తుందని అన్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్నీ ప్రార్థిస్తున్నాను. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇరవై ఏళ్ళ క్రితం..

ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 24, 2020 | 2:20 PM

ఎస్పీ బాలు ఆసుపత్రిలో కరోనాతో పోరాటం చేయడం కలచి వేస్తుందని అన్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్నీ ప్రార్థిస్తున్నాను. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇరవై ఏళ్ళ క్రితం గోదావరి నదీ జలాలను గ్రామ గ్రామానికి తరలించడానికి మేము చేపట్టిన యాత్ర కోసం పాట పాడారు. ఆ సందర్భంలో మెడిగడ్డ నుండి పోలవరం వరకు సాగిన ఆ యాత్రలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాట పాడారు.

ఇచ్చెమ్ పల్లి అడవుల్లో మేము చేసిన యాత్ర కోసం బాలు గారు పాడిన పాట అప్పట్లో యువతను ఉర్రుతలూగించింది. ఆ పాటను వందేమాతరం శ్రీనివాస్ ద్వారా ఎస్పీబీ గారికి చేరవేస్తే మాకు రేండు రోజుల్లో అందించారు. ఇరవై ఏళ్ళ క్రితం ఆయన పడిన పాట ఇప్పటికీ మా మదిలో మెదులుతుంది. ఆనాడు ఆయన పడిన పాట యావత్తు ఆంధ్ర దేశాన్ని మెప్పించగలిగింది. సామాజిక స్పృహను మేళవించి విధంగా ఉన్న ఆ పాట నేటికి ఒక చరిత్ర. ఆయన త్వరగా కోలుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు మళ్ళీ స్వరం వినిపించాలి. కమర్షియల్ పాటలే కాదు సామాజిక స్పృహ ఉన్న పాటలు పాడటం ఆయనకే చెల్లింది. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అనంతరం మేము రాజకీయంగా బిజీ అవడం వల్ల మరచిపోయామని పేర్కొన్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

Read More:

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది

బ్రేకింగ్: సెప్టెంబర్ 3న ఏపీ కేబినెట్