దుబాయ్ హోటల్ రూమ్‌లో జడేజా ఏం చేశాడో తెలుసా…
ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్.. దుబాయ్‌లోని ఒక లగ్జరీ హోటల్‌లో బస చేసింది. క్వారంటైన్‌లో ఉంది ధోనీ సేన. ఇలా వారం రోజుల పాటు ఉండాలి...
ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్.. దుబాయ్‌లోని ఒక లగ్జరీ హోటల్‌లో బస చేసింది. క్వారంటైన్ నిబంధనలు పాటిస్తున్న ధోనీ సేన ఓ స్టార్ హోటల్‌లో ఉంటోంది. ఒక్కొక్కరికి ఒక్కో గదిని కేటాయించారు. ఈ లగ్జరీ సూట్‌లో అన్ని వసతులను కల్పించారు. వారి రూమ్ వద్దకే అన్ని వసతులు అందేలా ఏర్పాట్లు చేశారు. వారం రోజుల పాటు క్వారంటైన్‌లో భాగంగా సీఎస్‌కే జట్టు ఇదే హోట్‌లో ఉండనున్నారు. దీనికి తోడు వ్యక్తిగతమైన వ్యాయామం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది జట్టు యాజమాన్యం.
దీంతో ఆటగాళ్లు తమ రూమ్‌లో ఫిట్‌నెస్ పెంచుకునేందుకు వర్క్ అవుట్ చేస్తున్నారు. అయితే రవీంద్ర జడేజా కూడా తన స్పెషల్ సూట్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఇదే వీడియోను సీఎస్‌కే జట్టు యాజమాన్యం కూడా రీ పోస్ట్ చేసింది. అంతే కాదు ఓ కామెంట్‌ను కూడా జోడించింది. ‘మీరు మల్లు పాటలకు పని చేస్తున్నప్పుడు.. మీరు దుబాయ్‌లో ఉన్నారని మీకు తెలుసు..! అంటూ సరదా కామెంట్‌ను పోస్ట్ చేసింది. ఇందులో ఓ మలయాళి పాట డంబెల్స్‌తో ఫిట్‌నెస్ పెంచుకుంటున్నాడు జడాజా. బ్యాక్ గ్రౌండ్‌లో మంచి సాంగ్ వస్తుండగా జడేజా దుమ్ముదుల్పుతున్నాడు.
#quarantine #workout #csk pic.twitter.com/Gac1kRnjEO
— Ravindrasinh jadeja (@imjadeja) August 23, 2020
కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్న తర్వాతే జట్టుతో కలవనున్నారు. ఆ మూడు టెస్టుల్లో నెగిటివ్ అని తేలితేనే ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే మళ్లీ హెమ్ క్వారంటైన్‌కు వెళ్లక తప్పదు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న క్రికెటర్లకు ఎవరికీ కరోనా లేకపోవడంతో వారికి ఈ క్వారంటైన్‌తో వచ్చిన నష్టం ఉండకపోవచ్చు. ప్రస్తుతం ప్రోటాకాల్‌ను పాటిస్తూ స్వీయ నిర్భందంలో ఉండటం ఐపీఎల్ నిబంధనల్లో ఇది ఓ భాగం.
#quarantine #workout #csk pic.twitter.com/BiUaMdz8j5
— Ravindrasinh jadeja (@imjadeja) August 23, 2020