Hyderabad: పోలీసుల తనిఖీల్లో కంగారుపడ్డ ఇద్దరు వ్యక్తులు.. డౌట్ వచ్చి బ్యాగ్ చెక్ చేయగా

రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ అక్రమ దందాకు అడ్డుకట్ట వేస్తున్నా.. కేటుగాళ్లు మాత్రం తమ అక్రమ రవాణాను యదేచ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా.. వారి ఆట కట్టిస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్‌లో..

Hyderabad: పోలీసుల తనిఖీల్లో కంగారుపడ్డ ఇద్దరు వ్యక్తులు.. డౌట్ వచ్చి బ్యాగ్ చెక్ చేయగా
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 12, 2024 | 1:03 PM

రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ అక్రమ దందాకు అడ్డుకట్ట వేస్తున్నా.. కేటుగాళ్లు మాత్రం తమ అక్రమ రవాణాను యదేచ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా.. వారి ఆట కట్టిస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

విశ్వసనీయ సమాచారంతో MDMA డ్రగ్స్‌ను విక్రయానికి యత్నించిన ఇద్దరు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు. దుండిగల్ పీఎస్ పరిధి గండి మైసమ్మలో ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా ద్విచక్ర వాహనంలో వెళుతుండగా.. వారిని ఆపి క్షుణ్ణంగా చెక్ చేశారు ఎక్సైజ్ అధికారులు. వాహనం తనిఖీల్లో.. వారి వద్ద ఉన్న టూల్ కిట్ బాక్స్‌ చెక్ చేయగా.. అందులో ఎండీఎంఏ డ్రగ్స్ క్రిస్టల్స్ ఉన్నట్టు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని.. నిందితులైన క్రాంతి, మహమ్మద్ సోయల్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఆ డ్రగ్స్ దాదాపు రెండున్నర లక్షల విలువైనదిగా పోలీసులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు నుంచి కిరణ్ అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కి ఈ డ్రగ్స్‌ను తీసుకువచ్చినట్లుగా ఎక్సైజ్ పోలీసులు కనిపెట్టారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు.

ఇది చదవండి: ఉన్నట్టుండి నిద్రపోతున్న చిన్నారి ఉయ్యాల పైకెక్కిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఇది సీన్..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!