GHMC Budget: జూలై 1 నుంచి గ్రెటర్‌లో పెద్ద ఎత్తున పట్టణ ప్రగతి.. 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మేయర్

GHMC Budget 2021-22 : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను నగర మేయర్ విజయలక్ష్మి మంగళవారం ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో

GHMC Budget: జూలై 1 నుంచి గ్రెటర్‌లో పెద్ద ఎత్తున పట్టణ ప్రగతి.. 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మేయర్
Ghmc Budget 2021 22
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 29, 2021 | 11:50 AM

GHMC Budget 2021-22 : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను నగర మేయర్ విజయలక్ష్మి మంగళవారం ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మంగళవారం జీహెచ్ఎంసీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం వర్చువల్‌ విధానంలో జరిగింది. ఈ సందర్భంగా నగరంలో చేపట్టనున్న అభివృద్ధిపై మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ప్రసంగించారు. జూలై 1 వ తేదీ నుండి పది రోజులపాటు గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున పట్టణ ప్రగతి చేపట్టనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రగతి కింద రూ.936 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన గత డిసెంబర్‌ 17న స్టాండింగ్‌ కమిటీ ఆమోదించిన బడ్జెట్‌ను, ప్రస్తుత ప్రణాళికను ప్రవేశపెట్టారు.

వార్షిక బడ్జెట్‌ను రెండు భాగాలుగా విభజించారు. మొత్తం బడ్జెట్‌ను 6,841.87 కోట్లు నిర్ధారించారు. మొదటిది జీహెచ్ఎంసీ బడ్జెట్ 5,600 కోట్లు, కాగా.. రెండొది జీహెచ్ఎంసీ 2బీహెచ్‌కే రూ. 1,241.87 కోట్లుగా విభజించారు. రెవెన్యూ ఆదాయం 3,571 కోట్లు కాగా.. రూ.983.04 కోట్లు మూలధన ఆదాయంగా చూపించారు. దానిని పరిశీలిస్తే.. అధిక శాతం రూ.1850 కోట్లు ఆస్థిపన్ను రూపంలో లభించనుంది. మొత్తం జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2414 కోట్లు కాగా.. క్యాపిటల్ వ్యయం రూ.3186 కోట్లుగా చూపించారు. బడ్జెట్‌ ఆమోదం అనంతరం జరిగే సాధారణ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

ఇదిలాఉంటే.. లింగోజిగూడ డివిజన్‌ ఉప ఎన్నికలో గెలుపొందిన కార్పొరేటర్‌ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డితో మేయర్‌ ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన రేవంత్‌కు మేయర్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేశారు. Also Read:

Telangana Congress: అసమ్మతి రాగం.. అసంతృప్తి తాళం.. ఇవే పీసీసీ కొత్త బాస్‌ ముందున్న సవాళ్లు..

Karthika Deepam: పెళ్ళికి సాక్ష్యులుగా సౌందర్య, దీపలు రావాల్సిందేనని మోనిత వార్నింగ్.. నేనో చిత్తుకాగితాన్ని అంటున్న కార్తీక్