BJP: విశ్వరూప మహాసభలో మందకృష్ణ మాదిగ భావోద్వేగ ప్రసంగం..
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మాదిగ విశ్వరూప మహాసభ ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అనేక అంశాలను ప్రస్తావించారు. నరేంద్ర మోదీ పేద కుటుంబంలో నుంచి వచ్చి దేశానికి ప్రధాని అయ్యారని తెలిపారు. మంద కృష్ణ మాదిగ గురించి ప్రస్తావిస్తూ ఆయనకు అనేక బెదిరింపులకు ఎదురైనా, అవమానాలు ఎదురైనా బీజేపీ సభకు హాజరయ్యారని తెలిపారు.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మాదిగ విశ్వరూప మహాసభను ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అనేక అంశాలను ప్రస్తావించారు. నరేంద్ర మోదీ పేద కుటుంబంలో నుంచి వచ్చి దేశానికి ప్రధాని అయ్యారని తెలిపారు. మంద కృష్ణ మాదిగ గురించి ప్రస్తావిస్తూ.. ఆయనకు అనేక బెదిరింపులకు ఎదురైనా, అవమానాలు ఎదురైనా బీజేపీ సభకు హాజరయ్యారని తెలిపారు. మోదీ, మాదిగ సామాజికవర్గ సభకు హాజరు కావడం అంటేనే మనం సాధించిన తొలి విజయంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సభకు విచ్చేసిన మందకృష్ణ మాదిగను మాట్లాడాలని కోరారు.
ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశాన్ని రక్షిస్తూ, అభివృద్ది చేస్తూ మనల్ని కూడా ఆ మార్గంలో తీసుకెళ్తున్నారు అని కీర్తించారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు. మాదిగ సామాజిక వర్గ ప్రజలు పడుతున్న బాధలు, ఆవేదనను వినేందుకు దేశ ప్రధాని రావడం నిజంగా ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మాదిగ సామాజిక వర్గం అని చెప్పుకోవడానికి సమాజంలో సిగ్గుపడే వాళ్లం అన్నారు. మేం ఎదురు పడితే దూరం దూరం అంటూ మమల్ని పక్కన పెట్టే వాళ్లంటూ భావోద్వేగానికి గురయ్యారు. తమను అంటరాని వాళ్లని పశువుల కంటే కూడా హీనంగా చూశారంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. అలా తక్కువ చేసిన తమ సామాజిక వర్గానికి అండగా ఉండేందుకు నరేంద్ర మోదీ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అన్నారు. ఇప్పటి వరకూ వచ్చిన వాళ్లు మాటలు చెప్పిన వాళ్లే, మీరు మాత్రమే చేతల్లో చూపించారన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




