AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు భారీ వర్షాలు..

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. సెప్టెంబర్‌ 30, అక్టోబరు 1 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది. అటు ఏపీలోనూ రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు భారీ వర్షాలు..
Telugu States Rains
Ravi Kiran
|

Updated on: Sep 30, 2023 | 11:56 AM

Share

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. సెప్టెంబర్‌ 30, అక్టోబరు 1 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది. ఫలితంగా, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసాయి. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల, నిజామాబాద్‌, మెదక్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. హైదరాబాద్ నగరవ్యాప్తంగా, పరిసర జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడ్డాయి.

ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్..

ఆంధ్రప్రదేశ్‌కు కూడా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు అక్టోబర్ 3 నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. ఇక శనివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, ప్రకాశం, అన్నమయ్య, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనుండగా.. తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే