ఎన్నికల విధుల్లో పోలీసులు మస్త్ బిజీ.. సమస్య ఏదైనా సరే వెయిట్ చేయాల్సిందే!
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుండి పోలీసులకి వర్క్ లోడ్ మరీ ఎక్కువయ్యింది . దీంతో పోలీసులు పోలీస్ స్టేషన్ కంటే.. ఎన్నికల విధుల్లోనే ఎక్కువగా సమయం గడపాల్సి వస్తోంది. పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీ కావడంతో.. పోలీస్ స్టేషన్లలో సిబ్బంది చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటున్నారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కి వస్తున్న వారు పోలీస్ స్టేషన్లో సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్నికల వేళ ప్రస్తుతం అత్యంత బిజీగా ఉండేది పోలీసులే… అటు రాజకీయ నాయకులు ప్రచారంలో బిజీగా ఉండటం సహజమే. కానీ ఎన్నికల బందోబస్తు విధుల్లో పోలీసులు అంతకుమించి బిజీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుండి పోలీసులకి వర్క్ లోడ్ మరీ ఎక్కువయ్యింది . దీంతో పోలీసులు పోలీస్ స్టేషన్ కంటే.. ఎన్నికల విధుల్లోనే ఎక్కువగా సమయం గడపాల్సి వస్తోంది. పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీ కావడంతో.. పోలీస్ స్టేషన్లలో సిబ్బంది చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటున్నారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కి వస్తున్న వారు పోలీస్ స్టేషన్లో సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సై కోసం గంటల తరబడి వాయిట్ చేయాల్సి వస్తోంది. ఎన్నికల బందోబస్తులో ఉన్న కారణంగా పోలీస్ స్టేషన్లో విధుల కంటే ఎన్నికల వీధుల్లోనే పోలీసులు ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది.
ముఖ్యంగా వెస్ట్ సెంట్రల్ జోన్ లో ఉన్న పోలీస్ స్టేషన్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ నిరంతరం పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుండటంతో పోలీసులు స్టేషన్లో కంటే బయటే వారు ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. దీంతో పాటు సాయంత్రం అయిందంటే చాలు వాహనాల చెకింగ్ పేరుతో పోలీసులు బయటే ఉంటున్నారు. ఎన్నికల బందోబస్తు డ్యూటీలో పోలీసులు నిమగ్నమవడంతో పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఏర్పడింది. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వస్తున్న వారు స్టేషన్లో సిబ్బంది లేకపోవడంతో నిరాశతో వేనుదిరుగుత్నారు. సదరు ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్టేషన్ కు వచ్చేవరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పోలీస్ స్టేషన్లను విభజించిన తర్వాత సాధారణంగానే పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉంది. వెస్ట్ జోన్ తో పాటు చాలా పోలీస్ స్టేషన్లలో ఇప్పటికీ సిబ్బంది తక్కువగా ఉన్నారు. సిబ్బంది ఉన్న ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావటంతో ఉండాల్సిన సిబ్బంది సంఖ్య క్రమంగా తగ్గింది. వెస్ట్ జోన్ లో ఉన్న రెండు మూడు పోలీస్ స్టేషన్ లలో సిబ్బంది అసలే ఉండటం లేదు. ఒక్కో ఎస్సై కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎన్నికల సీజన్ ముగిసే వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని మరికొంతమంది సిబ్బంది బహిరంగంగానే చెప్తున్నారు. దీంతో ఫిర్యాదుదారులు ఏం చేయాలో అర్థం కాక గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది కొరతను పరిష్కరించి తగిన సంఖ్యలో పోలీసులు పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండేలా చూడాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.
