TS Lockdown : అత్యంత కఠినంగా లాక్ డౌన్.. డెలివరీ బాయ్స్‌కు సైతం నో, బయటకొచ్చిన జనం మాటలు విని విస్తుపోతోన్న పోలీసులు

Telangana Lockdown : తెలంగాణ సర్కారు ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అత్యంత కఠినంగా అమలు చేయాలని..

TS Lockdown : అత్యంత కఠినంగా లాక్ డౌన్.. డెలివరీ బాయ్స్‌కు సైతం నో,   బయటకొచ్చిన జనం మాటలు విని విస్తుపోతోన్న పోలీసులు
TS Lockdown
Follow us
Venkata Narayana

|

Updated on: May 22, 2021 | 2:10 PM

Telangana Lockdown : తెలంగాణ సర్కారు ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అత్యంత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించిన పోలీసులు జొమాటో, స్విగ్గి డెలివరీ బాయ్స్ వాహనాలను సైతం సీజ్ చేస్తున్నారు. ఈ కామర్స్ లో ఉన్న సేవలకు కూడా అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా తమను అపేస్తున్నారంటూ ఈ కామర్స్ డెలివరీ బాయ్స్ అవేదన వ్యక్తం చేస్తున్నారు. జొమాటో మాకు పెనాల్టీ వేస్తుంది మొర్రో.. అంటూ పోలీసుల ముందు మొరపెట్టుకుంటున్నారు. పోలీసుల ఫైన్ తో అసలే అంతంత మాత్రంగా ఉన్న తమ బతుకులు మరింత నష్డపోయి కష్టాల్లోకి పోతాయని చెప్పుకొస్తున్నారు. మరోవైపు, కుంటి సాకులు చెప్పిన వారి వాహనాలు పోలీసులు సీజ్ చేస్తున్నారు. అంతేకాదు, సదరు వాహనాలను లాక్ డౌన్ ముగిసిన తర్వాతే ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇలా ఉండగా, లాక్ డౌన్ లో బయటకు వస్తున్న వారు చెబుతున్న కారణాలు విని పోలీసులు షాక్ కి గురవుతున్నారు.. పాత మెడికల్ బిల్లులు పెట్టుకుని ఫ్రెండ్స్ ని కలవటానికి బయటకు వస్తున్నారని, ఇంట్లో బోర్ కొడుతోందని కొందరు చెబుతున్నారని పోలీసులు అంటున్నారు.

కాగా, తెలంగాణలో ఈ నెలాఖరు (30 మే 2021) వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తదనుగుణంగా ఉత్తర్వులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పొడిగింపు ఉత్తర్వులను పటిష్టంగా అమలుచేయుటకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్. పి. లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఆదేశించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాల‌ని తెలంగాణ‌ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్న‌తాధికారుల‌కు జారీ చేసిన ఆదేశాలు మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఫలితంగా హైదరాబాద్ తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన నగరాలలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు.

Read also : CM KCR condolences : తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని, గాయకుడ్ని కోల్పోయింది : ముఖ్యమంత్రి కేసీఆర్