Raghu Ramakrishna Raju bail updates : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు నేడు బెయిల్ పై విడుదల అయ్యే అవకాశం
Raghu RamaKrishna Raju Bail update : నరసాపురం ఎంపీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు నేడు బెయిల్ పై విడుదల అయ్యే అవకాశం ఉంది...
Raghu RamaKrishna Raju Bail update : నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు నేడు బెయిల్ పై విడుదల అయ్యే అవకాశం ఉంది. నిన్న సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలమేరకు రఘురామ తరుపు న్యాయవాదులు నేడు ట్రయిల్ కోర్ట్ లో లక్ష రూపాయల వ్యక్తిగత బాండు, ఇద్దరు పూచీకత్తులు సమర్పించునున్నారు. బెయిల్ పై బయటి వచ్చాక సీఐడీ పోలీసుల విచారణకు సహకరించాలని సుప్రీం తన షరతులతో కూడిన బెయిల్ మంజూరు ఆదేశాల్లో పేర్కొంది. ఈ కేసులో విచారణ చేయాలనుకుంటే 24 గంటలు ముందు నోటీసులు జారీ చేయాలని CID పోలీసులకు కూడా సుప్రీం న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. బెయిల్ పై వచ్చిన రఘురామ మీడియా తో మాట్లాడడం కానీ , ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ చేయకూడదంటూ షరతు విధించింది. సుప్రీం కోర్టు ఆదేశించిన షరతులు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని న్యాయస్థానం తెలిపింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పటికే మిలటరీ ఆస్పత్రికి సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ చేరింది. దీంతో సీఐడీ కోర్టు లో బెయిల్ ప్రక్రియ పూర్తి చేసి, రిలీజ్ ఆర్డర్ చూపించిన తరువాత ఎంపీ రఘురామ కృష్ణంరాజు మిలిటరీ ఆస్పత్రి నుండి బయటికి రానున్నారు.