INS Rajput : నలభైఒక్కేళ్లపాటు భారత నావికాదళానికి కొండంత అండగా నిలిచిన ‘ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్’ నిష్క్రమణ నేడే

Indian Navy's INS Rajput : 41 ఏళ్లపాటు భారత నావికాదళానికి కొండంత అండగా నిలిచిన ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్ ఇక నిష్క్రమించనుంది.

INS Rajput : నలభైఒక్కేళ్లపాటు భారత నావికాదళానికి కొండంత అండగా నిలిచిన 'ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్' నిష్క్రమణ నేడే
Ins Rajput
Follow us

|

Updated on: May 21, 2021 | 7:21 AM

Indian Navy’s INS Rajput : 41 ఏళ్లపాటు భారత నావికాదళానికి కొండంత అండగా నిలిచిన ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్ ఇక నిష్క్రమించనుంది. ఇవాళ్టి నుంచి భారత నావికాదళం సేవల నుంచి ఇది వైదొలగబోతోంది. భారత నావికాదళంలో విశేష సేవలు అందించిన డిస్ట్రాయిర్ నౌక ఈ ‘ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌’. ఇది 21 మే 2021 నుంచి తన సేవల నుంచి తప్పుకోనుందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నావికాదళంలో తొలి తరం శత్రు నౌకల విధ్వంసక నౌక ఇది. పూర్వపు సోవియట్‌ యూనియన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ రష్యా (యుఎస్‌ఎస్‌ఆర్‌) నిర్మించిన కాషిన్‌-క్లాస్‌ డిస్ట్రాయర్ల కోవకు చెందిన ప్రధాన నౌక ఈ ‘ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌’. 1980 మే 4న ఇది తన సర్వీస్‌ను ప్రారంభించింది. నికోలెవ్‌ (ప్రస్తుత ఉక్రెయిన్‌)లోని 61 కమ్యునార్డ్స్‌ షిప్‌యార్డ్‌లో ఇది తయారైంది. దీని అసలు రష్యన్‌ పేరు ‘నాదేజ్నీ’ అంటే ఆశ ‘హౌప్‌’ అని అర్థం. విశాఖపట్టణంలోని నేవల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌ను సేవల నుంచి తొలగించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించ తలపెట్టారు. స్టేషన్‌లోని అధికారులు, నావికులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

4 మే 1980న జార్జియాలోని పోటిలో యూఎస్ఎస్ఆర్‌లో అప్పటి భారత రాయబారి ఐకే గుజ్రాల్.. కెప్టెన్ గులాబ్ మోహన్‌లాల్ హీరానందనితో కలిసి దీనిని ప్రారంభించారు. ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌కు గులాబ్ తొలి కమాండింగ్ అధికారి. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఇది దేశానికి ఎనలేని సేవలు చేసింది. దేశాన్ని భద్రంగా ఉంచడంలో ఈ నౌక ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. వీటిలో కీలకమైనవి.. ఐపికెఎఫ్‌కు సహాయపడటానికి ఆపరేషన్‌, అండమాన్‌ – శ్రీలంక తీరంలో పెట్రోలింగ్‌ విధుల కోసం ఆపరేషన్‌ పవన్‌, మాల్దీవుల నుండి తాకట్టు పరిస్థితిని పరిష్కరించడానికి ఆపరేషన్‌ కాక్టస్‌, లక్షద్వీప్‌ నుండి ఆపరేషన్‌ క్రోవ్‌నెస్ట్‌ తదితరాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ ఓడ అనేక ద్వైపాక్షిక, బహుళ-జాతీయ ఎక్సర్ సైజెస్ లో పాల్గొంది. ఈ నౌక భారత ఆర్మీ రెజిమెంట్‌తో అనుబంధంగా ఉండి.. 2019 ఆగస్టు 14న చివరిగా బాధ్యతలు నిర్వహించింది. ఇక.. ఈ ఓడ కోసం 31 కమాండింగ్‌ అధికారులు పనిచేసేవారు.

Read also : KCR : ఇవాళ వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించనున్న సీఎం కేసీఆర్.. కరోనా రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం.!