Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం.. ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
AP Assembly on Vizag steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే వ్యూహాలకు కేంద్రం పదును పెట్టిన విషయం తెలిసిందే. వైజాగ్ స్టీల్ ఫ్లాంట్‌ను ప్రైవేటీకరణ ప్రక్రియను ఇప్పటికే కేంద్రం వేగవంతం చేసింది. అయితే.. ఆ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ముక్తకంఠంతో అసెంబ్లీ ఆమోదించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయాన్ని కూడా అసెంబ్లీ వేదికగా మంత్రి గుర్తు చేశారు. ఈ తీర్మానం అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.