Hyderabad: మందుబాబుల మనసు చివుక్కుమంటుంది.. ఈ వార్త వింటే
మందుబాబులకు ఇది కొంచెం బ్యాడ్ న్యూసే.. ఏప్రిల్ 12న శనివారం నాడు హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి నెక్స్ట్ రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

మందుబాబులకు ఓ బ్యాడ్ న్యూస్. హనుమాన్ జయంతి నేపథ్యంలో ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు అన్ని వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. కల్లు దుకాణాలకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. జంటనగరాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రజలు సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రజలు ఆనందోత్సాహాలతో హనుమాన్ జయంతి జరుపుకోవాలని సూచించారు.
ఇక రాష్టానికి కొత్త లిక్కర్ బ్రాండ్లు రావాలని తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యానికి ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 92 మద్యం సరఫరా కంపెనీలు.. 604 రకాల మద్యం బ్రాండ్లను సరఫరా చేస్తామంటూ అప్లికేషన్స్ అందజేశాయి. వీటిలో 331 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కొత్త బ్రాండ్లు కాగా, 273 ఫారిన్ బ్రాండ్లు ఉన్నట్లు తెలిసింది. మరోవైపు శనివారం నగరంలో జరగబోయే హనుమాన్ శోభాయాత్రకు కమిషనర్ సీవీ ఆనంద్.. పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి
