మరో విద్యార్థి ప్రాణం తీసిన ర్యాష్ డ్రైవింగ్.. హిట్ అండ్ రన్ కేసులో యువతి మృతి!
రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేయడం.. ఎవరికి ఒకరికి వాహనం తగిలించడం.. ఆపై ఎవరికి దొరకకుండా పరుగులు తీయడం.. ఈ ఘటనలు కామన్‌గా మారిపోయాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోగా, యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేయడం.. ఎవరికి ఒకరికి వాహనం తగిలించడం.. ఆపై ఎవరికి దొరకకుండా పరుగులు తీయడం.. ఈ ఘటనలు కామన్‌గా మారిపోయాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోగా, యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని కోహెడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్.. మితిమీరిన వేగంతో బైక్‌ను ఢీకొట్టి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్నవారిలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. యువకుడికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. యువతి మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతురాలిని భువనగిరి జిల్లాకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు.
కోహెడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది యువతి. స్నేహితుడితో బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్ చైతన్యపురికి చెందిన ప్రదీప్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
