Kishan Reddy: హైదరాబాద్‌లో ‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’ ప్రారంభోత్సవం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, వారసత్వ ప్రాంతాలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. హైదరాబాద్‌లో సంగీతం, నాటక అకాడెమీకి సంబంధించిన దక్షిణ భారత ప్రాంతీయ కేంద్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఎం. వెంకయ్య నాయుడుతో కలిసి కిషన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.

Kishan Reddy: హైదరాబాద్‌లో ‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’ ప్రారంభోత్సవం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
Kishan Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 12, 2024 | 8:35 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, వారసత్వ ప్రాంతాలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. హైదరాబాద్‌లో సంగీతం, నాటక అకాడెమీకి సంబంధించిన దక్షిణ భారత ప్రాంతీయ కేంద్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఎం. వెంకయ్య నాయుడుతో కలిసి కిషన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అంతేకాకుండా.. గానగాంధర్వుడు, తెలుగు జాతి గర్వించదగిన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శతజయంతి స్మారకంగా ‘భారత కళామండపం’ పేరుతో ఓ ఆడిటోరియానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి సుశీలతో పాటు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని వివిధ అధికారులు కూడా పాల్గొన్నారు. సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రమైన దక్షిణ భారత్ సాంస్కృతిక కేంద్రాన్ని తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రారంభించారు.

Bharat Kala Mandapam

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… దక్షిణ భారత దేశంలో పూర్తి స్థాయి ప్రాంతీయ కేంద్రం లేదని, దీనిని కేంద్రం అన్ని విధాలుగా పూర్తిచేస్తుందని పేర్కొన్నారు. సంగీతం, జానపద, గిరిజన కళలు, రంగస్థలం, తోలుబొమ్మలాటకు సంబంధించిన పరిశోధన, డాక్యుమెంటేషన్‌ను ప్రోత్సహించడానికి ఈ దక్షిణ భారత్ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాన్ని అత్యాధునిక ప్రాంతీయ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన దేశ సంస్కృతికి, సంప్రదాయాలకు, పర్యాటకానికి ప్రధాని మోదీ అంబాసిడర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాకతీయుల కాలం నాటి రుద్రేశ్వర ఆలయానికి (రామప్ప దేవాలయం) యునెస్కో గుర్తింపు విషయంలోనూ ప్రధాని మోదీ వివిధ దేశాల అధినేతలతో మాట్లాడారన్నారు.

వీడియో చూడండి..

తెలంగాణకు సంబంధించిన చారిత్రక కట్టడాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు పూర్వవైభవాన్ని కల్పించే దిశగా కేంద్రం కృషిచేస్తోందన్నారు. యునెస్కో గుర్తింపుతోపాటుగా.. ప్రసాద్ పథకం కింద రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ పనులకు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా శంకుస్థాపన కూడా చేయించామన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ పట్టణానికి హెరిటేజ్ సిటీ గుర్తింపునిస్తూ పట్టణంలోని వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు చేపట్టామని వివరించారు.

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా.. ఈ మహాయజ్ఞంలో భాగమవడం తన అదృష్టంగా భావిస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని కళలు, కళాకృతులు, సంగీతం, నాటకం, జానపదం, గిరిజన నృత్యాలతోపాటుగా మన నాటకాలు, ఒగ్గుకథ, బుర్రకథ వంటి వాటిని ప్రోత్సహించేందుకే ‘దక్షిణ భారత సాంస్కృతిక కళా కేంద్రాన్ని’ ప్రారంభించుకున్నామన్నారు. ఇది ప్రభుత్వం సంకల్పిస్తే మాత్రమే పూర్తయ్యే పనికాదని.. అందరూ సహకరించాలని కోరారు.

South India Cultural Centre

మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. దీనికి దేశం మొత్తం ఆయనను అభినందిస్తుందన్నారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో మాతృభాష పాత్రను కూడా నొక్కి చెప్పారు. జాతీయ విద్యా విధానం ద్వారా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన మాతృభాషను మరింత ప్రోత్సహిస్తున్నాని.. పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2024 పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సత్కరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.