Telangana: ముదిరిన జలజగడం.. కృష్ణాజలాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం..

Big News Big Debate: తెలంగాణ అసెంబ్లీలో జలజగడం ముదిరింది. కృష్ణాజలాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ.. ఇరువర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్‌ సర్కార్‌. నల్గొండలో BRS తలపెట్టిన బహిరంగసభకు భయపడే తీర్మానం పెట్టారన్నారు గులాబీ సభ్యులు. దీంతో మాటల వేడి మరింత పెరిగింది.

Telangana: ముదిరిన జలజగడం.. కృష్ణాజలాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం..
Telangana Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 12, 2024 | 6:58 PM

Big News Big Debate: తెలంగాణ అసెంబ్లీలో జలజగడం ముదిరింది. కృష్ణాజలాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ.. ఇరువర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్‌ సర్కార్‌. నల్గొండలో BRS తలపెట్టిన బహిరంగసభకు భయపడే తీర్మానం పెట్టారన్నారు గులాబీ సభ్యులు. దీంతో మాటల వేడి మరింత పెరిగింది.

కృష్ణాజలాలు తెలంగాణ అసెంబ్లీలో సెగలు పుట్టించాయి. కృష్ణాప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించరాదంటూ… అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడంతో అధికార, విపక్షాల మధ్య మొదలైంది. సభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. అయితే, సభ్యుల వాదోపవాదాల మధ్య తీర్మానానికి ఆమోదం తెలిపింది శాసనసభ.

గత పాలకుల అశ్రద్ధ వల్ల నీటివాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు ఉత్తమ్‌. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు తెలంగాణకు, 500 టీఎంసీలు ఏపీకి దక్కేలా గతంలో కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. తమప్రభుత్వమే కొత్తగా ఒప్పందం చేసుకున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వమే కృష్ణాజలాలపై పెత్తనాన్ని కేంద్రానికి అప్పగించిందన్నారు మాజీ మంత్రి హరీశ్‌రావు.ఇటీవల జరిగిన కేఆర్‌ఎంబీ మీటింగ్‌ మినిట్స్‌ను ప్రస్తావించిన ఆయన.. గత ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారనీ, తామందుకు సిద్ధంగా లేమనీ స్పష్టం చేశారు. నల్గొండలో బీఆర్‌ఎస్‌ తలపెట్టిన సభను చూసి కాంగ్రెస్‌ భయపడిందనీ.. అందుకే తీర్మానం తీసుకొచ్చిందనీ ఎద్దేవా చేశారు.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

అయితే, కృష్ణాజలాలపై గతంలో IAS అధికారి స్మిత సబర్వాల్‌ కేంద్రానికి రాసిన లేఖను కాంగ్రెస్‌ ప్రస్తావించగా… ఇటీవల రాహుల్‌ బొజ్జా రాసిన లేఖలోనూ అదే విషయం ఉందని బీఆర్‌ఎస్‌ తెలిపింది. ఇప్పుడీ ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు రాసిన లేఖలు.. చర్చనీయాంశంగా మారాయి. కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించేందుకు ఆకారం తెలుపుతూ స్మిత లేఖ రాశారని కాంగ్రెస్ అంటే… యథాతథ స్థితిని కొనసాగించాలని మాత్రమే డిమాండ్‌ చేసినట్టు బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. మరి ఈ జలసమరం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.