కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో అమాయకులను క్రిమినల్స్‌గా మారుస్తున్న ముఠా అరెస్ట్‌

విదేశాల్లో ఉద్యోగం అనగానే ఎగేసుకుని వెళ్తున్నారా..? ఏజెంట్లకు లక్షల రూపాయలు కట్టి మరీ ఫారెన్‌ వెళ్దామనుకుంటున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!! మీ బతుకు బుగ్గిపాలే. ఉద్యోగం పేరుతో విదేశాలకు తీసుకెళ్లి మిమ్మల్ని క్రిమినల్స్‌గా మారుస్తున్నాయి ముఠాలు. కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో అమాయకులను క్రిమినల్స్‌గా మారుస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. ముఠా సూత్రదారితోపాటు.. ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో అమాయకులను క్రిమినల్స్‌గా మారుస్తున్న ముఠా అరెస్ట్‌
Cambodia Case
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 09, 2024 | 5:58 PM

స్వదేశంలో అరకొర ఉద్యోగాలు… ఏళ్ల తరబడి చేసినా చాలిచాలని జీతం..! లైప్‌ రిస్క్‌ చేసైనా సరే వేదేశాల్లో కొన్నాళ్లపాటు పనిచేస్తే చేతినిండా డబ్బులు సంపాధించి తిరిగి రావచ్చని చాలమంది ఆశ. ఇలాంటి ఆశావహులనే టార్గెట్ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిండా ముంచుతున్నాయి. తాజాగా అలాంటి ముఠా ఆటకట్టించారు హైదరాబాద్‌ పోలీసులు.

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. లక్షల రూపాయలు దండుకుని నిండాముంచిన ఫేక్‌ కన్సల్టెన్సీలు ఉన్నాయి. విదేశాలకు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించకుండా.. లేదా జీతం ఇవ్వకుండా ముంచిన కేటుగాళ్లూ ఉన్నారు. కానీ.. తాజాగా ఓ డేంజరస్‌ ముఠా వెలుగులోకి వచ్చింది. విదేశాలకు తీసుకెళ్లిన యువకులను క్రిమినల్స్‌గా మారుస్తోంది ముఠా. పాస్‌పోర్ట్‌ లాక్కుని… బంధీ చేసి.. బెదిరించి.. దాడి చేసి.. నేరాలకు పాల్పడేలా చేస్తోంది ముఠా.

సిరిసిల్లకు చెందిన ఓ యువకుడికి కాంబోడియాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించాడు ఓ ఏజెంట్‌. తక్కువ ఖర్చుతో వెళ్లి తక్కువ టైంలో లక్షల రూపాయలు సంపాధించొచ్చని చెప్పడంతో యవకుడు కూడా అట్రాక్ట్‌ అయ్యాడు. కేవలం లక్షన్నర ఇస్తే చాలని చెప్పడంతో సరేనన్నాడు. ఏజెంట్‌కు లక్షా 40 వేలు ఇచ్చాడు. పాస్‌పోర్ట్‌, వీసా అరేంజ్‌ చేసిన ఏజెంట్‌.. ఆ యువకుడిని కాంబోడియా పంపాడు. కాంబోడియాలో ఆ యువకుడిని రిసీవ్‌ చేసుకున్నాడు అక్కడి లోకల్‌ ఏజెంట్‌.

ఇవి కూడా చదవండి

అక్కడికి వెళ్లగానే సీన్‌ మారిపోయింది. యువకుడు దిగీదగగానే.. పాస్‌పోర్ట్‌ లాక్కున్నారు కాంబోడియాలోని ముఠా సభ్యులు. యువకుడిని రూమ్‌లో బంధించారు. తాము చెప్పినట్టు వినాలని.. లేకపోతే చిత్రహింసలు తప్పవని బెదిరించారు. ఆ యువకుడితో… సైబర్‌ నేరాలు చేయించసాగారు ముఠా సభ్యులు. టాస్క్‌ల మాధిరిగా సైబర్‌ ఫ్రాడ్‌ లు చేయాలని చెప్తూ.రోజుకు 16నుంచి18 గంటలుపనిచేయించుకున్నారు.

విషయాన్ని యువకుడు తన తల్లికి చేరవేశాడు. షాక్‌ కు గురైన యువకుడి తల్లి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఎట్టకేలకు కాంబోడియాలో ఉన్న యువకుడిని కాంటాక్ట్‌ అయ్యారు. యువకుడికి అన్ని విధాల సాయం అందిస్తూ… ముఠా చెర నుంచి తప్పించారు. సురక్షితంగా హైదరాబాద్‌ తీసుకొచ్చారు పోలీసులు.

యువకుడి నుంచి ఏజెంట్ల సమాచారం సేకరించారు. ఉద్యోగాల పేరుతో గాలం వేస్తున్న జగిత్యాలకు చెందిన సాయిప్రసాద్, పుణేలో ఉంటున్న మహమ్మద్‌ అబిద్‌ హుస్సేన్‌ అన్సారీ, బిహార్‌కు చెందిన మహమ్మద్‌ షాదాబ్‌ఆలం ను అదుపులోకి తీసుకున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. వీళ్ల నుంచి ముఠా సూత్రదారి సుధాకత్‌ ఖాన్‌ వివరాలు రాబట్టారు. సుధాకత్‌ విదేశాలకు వెళ్లడంతో… ఎప్పుడెప్పుడు చిక్కుతాడా అని ఎదురుచూశారు పోలీసులు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హలియాపుర్‌కు చెందిన సాదకత్‌ఖాన్‌ ను ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మాల్దీవుల నుంచి తిరిగి వస్తుండగా… ఈ నెల 2న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సాదకత్‌ఖాన్‌ను అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆపేసి టీజీసీఎస్‌బీ పోలీసులకు సమాచారమిచ్చారు. ఇక్కడి నుంచి దిల్లీ వెళ్లిన బృందం తాజాగా అతడిని హైదరాబాద్‌ తీసుకొచ్చారు.

కంబోడియాలోని భారత్‌ ఎంబసీ సహకారంతో సిరిసిల్లకు చెందిన బాధిత యువకుడిని ముఠా చెర నుంచి తప్పించి హైదరాబాద్‌ తీసుకొచ్చామన్నారు పోలీసులు. ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అనే వివరాలు ఆరా తీస్తున్నామని.. ఎవరైనా ఉంటే వారిని కూడా రక్షించి తీసుకొస్తామంటున్నారు. విదేశాల్లో ఉద్యోగం అనగానే వెనకాముందు ఆలోచించకుండా.. గుడ్డిగా ఏజెంట్లను నమ్మొద్దని సూచిస్తున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం