AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KA.Paul: ఎనిమిదేళ్ల పాలనలో దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు.. కేంద్రంపై కేఏ పాల్ ఫైర్

కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని మండిపడ్డారు. ప్రమాదంలో పడి కోమా దశలో ఉందని అన్నారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ప్రధాని మోదీ రూ.55....

KA.Paul: ఎనిమిదేళ్ల పాలనలో దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు.. కేంద్రంపై కేఏ పాల్ ఫైర్
Ka Paul
Ganesh Mudavath
|

Updated on: Jul 10, 2022 | 8:35 AM

Share

కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని మండిపడ్డారు. ప్రమాదంలో పడి కోమా దశలో ఉందని అన్నారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ప్రధాని మోదీ రూ.55 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. 32 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2014లో చంద్రబాబుకు సహకారం అందించినట్లు వెల్లడించారు. కనీస అనుభవం లేని జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని మరింత అప్పుల కుప్పగా మార్చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై రూ.7.5 లక్షల అప్పు ఉందని వివరించారు. కేసీఆర్‌, చంద్రబాబులపై సీబీఐకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి, ప్రజా సమస్యలు తెలుసుకుంటామని కేఏ. పాల్ స్పష్టం చేశారు.

కాగా.. కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్ (Political Tour) కు రెడీ అవుతున్నారు. ఏపీ, తెలంగాణలో రోడ్‌షోలు, భారీ బహిరంగ సభలకు ప్లాన్‌ చేశారు. పాల్‌ రావాలి-పాలన మారాలి అనే నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఏపీలో జులై 9నుంచి పర్యటన మొదలవుతుందన్నారు. జులై 9న వైజాగ్‌, 10న విజయనగరంలో టూర్‌ ఉంటుదన్నారు. ఆ తర్వాత వరుసగా శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం, కర్నూలులో పర్యటించనున్నారు.

ఇవి కూడా చదవండి

జులై 23నుంచి ఆగస్ట్‌ 1వరకు తెలంగాణలో టూర్‌ ఉంటుందన్నారు పాల్‌. ఇక, సెప్టెంబర్ నుంచి రెండు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్పు కోరుకునేవారికి ఇదే చివరి అవకాశం అంటూ ఓటర్లకు బంపర్‌ ఆఫర్ ఇచ్చారు.

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!