Hyderabad: ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని.. కంపెనీ CEO ప్రాణం తీసుకున్నాడు

అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాలన్నది అతని కల. ఇందుకోసం అందుకోసం చాలా ప్రయత్నాలు చేశాడు. ఎన్నో కష్టాలు పడ్డాయి. కానీ వర్కువుట్ కాలేదు. దీంతో ఇంటికి తిరిగొచ్చాడు. ఆ తర్వాత నుంచి కెరీర్‌పై ఫోకస్ పెట్టలేకపోయాడు. నిత్యం వేధనలో ఉండేవాడు. ఈ క్రమంలోనే విపరీత నిర్ణయం తీసుకున్నాడు.

Hyderabad: ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని.. కంపెనీ CEO ప్రాణం తీసుకున్నాడు
Project Fail
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 29, 2024 | 12:12 PM

తన ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందనే ఆవేదనతో సంగారెడ్డిలోని అమీన్‌పూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఫిబ్రవరి 27 మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కాశీ విశ్వనాథ్‌గా గుర్తించారు. అమీన్‌పూర్‌లోని దుర్గా హోమ్స్ ఫేజ్-2లో నివసిస్తున్న 38 ఏళ్ల విశ్వనాథ్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో ఆరు నెలల క్రితం అమెరికా వెళ్లారు. అయితే, అతని ప్రయత్నం విఫలమైంది. దీంతో ఇండియాకు తిరిగి వచ్చేశాడు. అప్పటి నుంచి నైరాశ్యంలో ఉన్న అతను తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.

“కొన్నేళ్ల క్రితం.. మాదాపూర్‌లో విశ్వనాథ్, అతని స్నేహితులు ఎక్లాట్ ప్రైమ్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించారు. విశ్వనాథ్ యునైటెడ్ స్టేట్స్‌లో ఒక కంపెనీని స్థాపించాలని కలలు కన్నాడు. ఈ క్రమంలో అతనికి వివిధ సవాళ్లు ఎదురయ్యాయి, దీంతో ఆ ప్రాజెక్ట్‌ను విడిచిపెట్టి ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అప్పట్నుంచి విశ్వనాథ్ తీవ్రమైన డిప్రెషన్‌తో ఉన్నాడు” అని విశ్వనాథ్ భార్య వినీల తెలిపారు.

మంగళవారం మధ్యాహ్నం విశ్వనాథ్‌ ఆఫీసు రూమ్ లోపలి నుంచి తాళం వేసుకున్నాడు. అతనికి ఫోన్ చేసినా.. రెస్సాన్స్ రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ని ఆఫీసు తలుపు పడగొట్టి లోపలికి వెళ్లగా.. కిటికీ కడ్డీలకు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అమీన్‌పూర్‌ ఎస్‌ఐ ఈవీ రామన్‌ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..