AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో విల్లాలకు ఇవే హాట్ ప్లేస్‌లు.. రాసిపెట్టుకోండి.! మతిపోగొట్టే ఆఫర్లు.. లగ్జరీ డీల్స్

హైదరాబాద్‌లో విల్లాల క్రేజ్ ఎక్కువైపోయింది. కనెక్టివిటీ ఉంటే చాలు.. ఎంత దూరమైనా విల్లాలు కొనేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. మరి ఏయే ప్రాంతాల్లో విల్లాల క్రేజ్ ఎక్కువగా ఉందొ.. ఆ వార్త ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి మరి.

Hyderabad: హైదరాబాద్‌లో విల్లాలకు ఇవే హాట్ ప్లేస్‌లు.. రాసిపెట్టుకోండి.! మతిపోగొట్టే ఆఫర్లు.. లగ్జరీ డీల్స్
Hyderabad
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 26, 2025 | 11:50 AM

Share

హైదరాబాద్‌ మహానగరం నలువైపులా విస్తరిస్తోంది. భారీ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్స్‌‌లో హైరైజ్‌ బిల్డింగ్స్‌ సంఖ్య విపరీతంగా పెరిగింది. కోకాపేట, నానక్‌ రాంగూడ, నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. రాయదుర్గంలో ఎకరా 177 కోట్ల రూపాయలు పలికింది. సాఫ్ట్‌‌వేర్‌ కంపెనీలకు కూత వేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతమంతా అద్దాల మేడలతో రంగుల ప్రపంచంగా మారిపోయింది. విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతుంది. కాస్ట్‌‌లీ ఏరియాలో లగ్జరీ అపార్ట్‌‌మెంట్స్‌‌కు భారీగా డిమాండ్‌ ఉంది. టెకీలు.. తమ కార్యాలయాలకు దగ్గరలో ఉండే విధంగా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు పక్కనే ఉండటం, ఆఫీస్‌‌కు దగ్గరలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. లగ్జరీ అపార్ట్‌‌మెంట్స్‌‌కు క్రేజ్ పెరిగిందని.. దీంతో వీటి అమ్మకాల సంఖ్య పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

మరోవైపు విల్లాల కల్చర్‌ కూడా పెరిగిపోయింది. విల్లా అనేది స్టేటస్‌ సింబల్‌‌గా మారిపోయింది. అయితే పది కోట్ల రూపాయల వరకు వెచ్చించి విల్లాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కనెక్టివిటీ ఉంటే చాలు ఎంత దూరమైన వెళ్లి విల్లా కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కాలుష్య భూతానికి దూరంగా విల్లాల్లో విలాసవంతంగా జీవించేందుకు హైదరాబాదీలు మక్కువ చూపిస్తున్నారు. ఆఫీస్‌‌లకు దగ్గరగా ఉండాలని కోరుకునేవారు తప్పనిసరి పరిస్థితుల్లో లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ చూస్తున్నారు. శంషాబాద్‌, కిస్మత్‌‌పూర్‌, కొంపల్లి ప్రాంతాల్లో విల్లాల నిర్మాణాలు పెరిగిపోయాయి. డిమాండ్‌ మేరకే నిర్మాణాలు కొనసాగుతున్నాయని రియాల్టర్లు చెబుతున్నారు. విల్లాలు, అపార్ట్‌‌మెంట్స్‌ అమ్మకాల్లో దేని డిమాండ్‌ దానికే ఉందని నిపుణులు చెబుతున్నారు.

8 సిక్సర్లు, 5 ఫోర్లు.. 51 బంతుల్లో కుమ్మేసిన కేకేఆర్ సంచలనం
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. 51 బంతుల్లో కుమ్మేసిన కేకేఆర్ సంచలనం
1 రూపాయికే విమాన టికెట్‌.. ఇండిగో బంపర్‌ ఆఫర్‌..
1 రూపాయికే విమాన టికెట్‌.. ఇండిగో బంపర్‌ ఆఫర్‌..
మీ మొక్కలు వాడిపోతున్నాయా? అయితే ఈ 'చెత్త' ట్రిక్ ఫాలో అవ్వండి..
మీ మొక్కలు వాడిపోతున్నాయా? అయితే ఈ 'చెత్త' ట్రిక్ ఫాలో అవ్వండి..
ఉట్టిపడుతున్న సంక్రాతి శోభ.. ఛలో శిల్పారామం..
ఉట్టిపడుతున్న సంక్రాతి శోభ.. ఛలో శిల్పారామం..
సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్‌లో కీలక మార్పులు!
సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్‌లో కీలక మార్పులు!
అడ్డంకులు వస్తే భయపడుతున్నారా? గెలిచే వాడి 'సీక్రెట్' ఇదే
అడ్డంకులు వస్తే భయపడుతున్నారా? గెలిచే వాడి 'సీక్రెట్' ఇదే
తెల్ల నువ్వులు వర్సెస్‌ నల్ల నువ్వులు.. చలికాలంలో ఏది బెటర్..?
తెల్ల నువ్వులు వర్సెస్‌ నల్ల నువ్వులు.. చలికాలంలో ఏది బెటర్..?
నెమలి ఈకలను ఇంట్లోని ఈ 5 ప్రదేశాల్లో పెట్టండి.. మీపై సంపద వర్షమే
నెమలి ఈకలను ఇంట్లోని ఈ 5 ప్రదేశాల్లో పెట్టండి.. మీపై సంపద వర్షమే
పండగ వేళ BSNL దిమ్మదిరిగే ఆఫర్‌.. 5000GB డేటా, OTT ప్రయోజనాలు
పండగ వేళ BSNL దిమ్మదిరిగే ఆఫర్‌.. 5000GB డేటా, OTT ప్రయోజనాలు
హ్యాండిచ్చిన ఆటగాళ్లు.. కట్‌చేస్తే ఆ లీగ్‌నే వాయిదా వేసిన బంగ్లా
హ్యాండిచ్చిన ఆటగాళ్లు.. కట్‌చేస్తే ఆ లీగ్‌నే వాయిదా వేసిన బంగ్లా