AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హాస్టల్‌లో ఉండలేక అర్థరాత్రి గోడ దూకేందుకు ప్రయత్నించాడు.. కానీ

ఆంధ్రాలోని తెనాలికి చెందిన కర్రీ విజయ్​కుమార్, చాముండేశ్వరి దంపతులు సిటీకి వచ్చి ఈస్ట్ మారేడుపల్లిలోని టీచర్స్​ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు గిరీష్ కుమార్ ఇటీవల టెన్త్ కంప్లీట్ అవ్వంతో.. ఈ నెల 12న హయత్​నగర్​ సమీపంలోని కోహెడలో గల ఓ ప్రవేట్ జూనియర్​ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ చేశారు.

Hyderabad: హాస్టల్‌లో ఉండలేక అర్థరాత్రి గోడ దూకేందుకు ప్రయత్నించాడు.. కానీ
Girish Kumar
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 22, 2024 | 1:59 PM

Share

టెన్త్ క్లాస్ పాస్ అయిన ఆ యువకుడ్ని.. ఇంటర్ చదివేందుకు కార్పోరేట్ కాలేజ్‌లో జాయిన్ చేశారు పేరెంట్స్. అయితే అందర్నీ వదిలేసి అతను అక్కడ ఉండలేకపోయాడు. నా వల్ల కాదు అంటూ అమ్మానాన్నలకు ఫోన్ చేసి ఏడ్చాడు. ఒక రెండు రోజులు ఓపిక పట్టమని.. అప్పటికీ ఇబ్బంది అనిపిస్తే వచ్చి తీసుకెళ్తామని వారు సముదాయించారు. కానీ అక్కడి వాతావరణం అతడికి నరకప్రాయంగా అనిపించింది. తనంతట తానే ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. పర్మిషన్ ఇవ్వరు కాబట్టి.. గోడ దూకి బయటకు వచ్చే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌తో స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ దారుణ ఘటన హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి ఆంధ్రాలోని తెనాలికి చెందిన కర్రీ విజయ్​కుమార్, చాముండేశ్వరి దంపతులు సిటీకి వచ్చి ఈస్ట్ మారేడుపల్లిలోని టీచర్స్​ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు గిరీష్ కుమార్ ఇటీవల టెన్త్ కంప్లీట్ అవ్వంతో.. ఈ నెల 12న హయత్​నగర్​ సమీపంలోని కోహెడలో గల ప్రవేట్ జూనియర్​ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ చేశారు. ఈ నెల 16న వెళ్లి అక్కడ జాయిన్ చేసి వచ్చారు. అయితే తనకు అక్కడ ఉండబుద్ది కావడం లేదని పేరెంట్స్‌కు ఫోన్ చేసి చెప్పాడు. తల్లిదండ్రులు సముదాయించే ప్రయత్నం చేసినా.. అతను ఉండలేకపోయాడు. ఈ నెల 19న బుధవారం అర్ధరాత్రి తర్వాత అర్థరాత్రి సమయంలో హాస్టల్​బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కిందకు దిగాడు. అక్కడ కాలేజ్ ప్రాంగణం చుట్టూ ప్రహరీ ఉంది. దానిపై ఫెన్సింగ్​ ఉంది. గేటుకు ఎడమవైపున ట్రాన్స్​ఫార్మర్​ పక్కన ఉన్న గోడ ఎక్కి కిందకు దిగే యత్నం చేశాడు. ఈ క్రమంలో పైన ఉన్న కరెంట్​ తీగలు తగిలి, కరెంటు షాక్​కు గురయ్యాడు. స్పాట్‌లోనే చనిపోయాడు.

ఈ క్రమంలో గిరీశ్​ కనిపించడం లేదంటూ బాలుని తల్లిదండ్రులకు జూన్​ 20వ తేదీన కాలేజ్ స్టాఫ్ ఫోన్​చేసి చెప్పారు. దీంతో వారు కాలేజ్‌కు వచ్చి అన్ని చోట్లా ఆరా తీసినా ఏం సమాచారం తెలియలేదు. చివరకు హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు హాస్టల్​కు చేరుకుని వివరాలు సేకరించారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా, గిరీష్​ హాస్టల్​నుంచి కిందకు దిగుతున్న విజువల్స్ అందులో రికార్డయ్యాయి. కాలేజ్ ప్రాంగణం ప్రహరీ వెంబడి గాలిస్తుండగా చెట్ల పొదల్లో గిరీష్​ మృతదేహం కనిపించింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి