Hyderabad: టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..

Hyderabad: టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Jun 22, 2024 | 5:09 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. గాల్లో ఎగిరిన విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగగా, పైలట్‌ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగలిగారు. హైదరాబాద్‌ నుంచి కౌలా లంపూర్‌ వెళ్లాల్సిన విమానం.. టేకాఫ్‌ అయిన కాసేపటికే కుడి వైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అది గుర్తించిన పైలట్‌ ల్యాండింగ్‌ కోసం అనుమతి కోరారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. గాల్లో ఎగిరిన విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగగా, పైలట్‌ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగలిగారు. హైదరాబాద్‌ నుంచి కౌలా లంపూర్‌ వెళ్లాల్సిన విమానం.. టేకాఫ్‌ అయిన కాసేపటికే కుడి వైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అది గుర్తించిన పైలట్‌ ల్యాండింగ్‌ కోసం అనుమతి కోరారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఈ గ్యాప్‌లో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్‌ అయిన తర్వాత ప్రయాణికులందరినీ హుటాహుటిన బయటకు దించేశారు. సిబ్బంది సహా విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. విమానం సేఫ్‌గా ల్యాండ్‌ కావడం.. అంతా సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.