Viral Video: చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
ఆన్ లైన్ డెలివరీ సంస్థ జెప్టో ద్వారా ఆర్డర్ చేసిన చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుకను చూసి ప్రమీ శ్రీధర్ అనే మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకుంది ఆమె. జెప్టో నుంచి హెర్షే చాక్లెట్ సిరప్‌ని బ్రౌనీ కేక్‌లతో తినడానికి ఆర్డర్ చేయగా... సిరప్‌ను కప్‌లో పోస్తుండగా అందులో చనిపోయిన ఎలుక కనిపించిందని పేర్కొంది.
ఆన్ లైన్ డెలివరీ సంస్థ జెప్టో ద్వారా ఆర్డర్ చేసిన చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుకను చూసి ప్రమీ శ్రీధర్ అనే మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకుంది ఆమె. జెప్టో నుంచి హెర్షే చాక్లెట్ సిరప్‌ని బ్రౌనీ కేక్‌లతో తినడానికి ఆర్డర్ చేయగా… సిరప్‌ను కప్‌లో పోస్తుండగా అందులో చనిపోయిన ఎలుక కనిపించిందని పేర్కొంది. అయితే ఈ విషయం తెలియక ముందు కుటుంబ సభ్యులు సిరప్ రుచి చూశారని, దీంతో వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. ఏదైనా వస్తువు ఆర్డర్ చేసి తినే ముందు తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేయాలని, కేసు వేయాలని సూచిస్తున్నారు.
దీంతో హెర్షే సంస్థ స్పందించింది. ఇలాంటి ఘటన ఎదురైనందుకు తాము చింతిస్తున్నామని తెలిపింది. తమకు తయారీ కోడ్‌ను పంపాలని కోరింది. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ డెలివరీ పార్సిల్స్ లో వస్తున్న వాటిని చూసి చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం నోయిడాలో ఓ వ్యక్తి ఐస్‌క్రీంను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే అందులో తెగిన మనిషి వేలు కనిపించడం సంచలనం సృష్టించింది. దీంతో సదరు ఐస్‌క్రీం సంస్థ లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. అనంతరం బెంగళూరులోని ఓ వ్యక్తి అమెజాన్ నుంచి ఎక్స్ బాక్స్ కంట్రోలర్‌ను ఆర్డర్ చేయగా.. పార్శిల్ బాక్స్‌లో చిన్న తాచు పాము వుండడం చూసి ఒక్కసారిగా కస్టమర్ భయాందోళనకు గురయ్యాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.