Hyderabad: వామ్మో.! హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ ఇక తినాలంటేనే.. భయపడేలా చేశారు కదరా
అసలు ఏం తినాలి..ఏం తినొద్దు!! ఎక్కడ తినాలి! ఎక్కడ తినొద్దు!! డేంజర్ బెల్స్ మోగిస్తున్న అయిదున్నర టన్నుల కల్తీ స్వీట్స్, బూందీ. బతకటం కోసం తింటే... చంపేస్తున్న ఆహారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజుకో చోట. కల్తీ అండ్ డేంజర్ ఫుడ్. మెమోస్, షవర్మా, మండి బిర్యానీ మనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలు , శుభ్రతలేని చోట తింటే మాత్రం మటాష్.
అధికారులు దాడులు చేస్తున్నారు. నాణ్యతలేని ఆహారపదార్థాల్ని సీజ్ చేస్తున్నారు. నోటీసులిస్తున్నారు. కొన్ని షట్టర్లకు తాళాలేస్తున్నారు. అయినా భయంలేదు. వ్యాపారం ఆగదు. మరీ ఇంటి భోజనంలా కుదురుగా వడ్డిస్తే ఇంకేమన్నా ఉందా.. అధికారుల పని అధికారులదే. మన పని మనదేనన్నట్లు వ్యవహరిస్తున్నాయి హోటళ్లు, ఆహారపదార్థాల తయారీ కేంద్రాలు. బయటతినడం ఎవరికీ సరదాకాదు. కొందరికి అనివార్యం. పరుగుల ప్రపంచంలో ఇంటినుంచే లంచ్‌బాక్స్‌తో బయలుదేరే అవకాశం అందరికీ ఉండదు. సేమ్ టైమ్ ఎప్పుడూ వంటగదిలోనేనా.. ఈ పూట కాస్త బయట ఎంగిలిపడదామనే కల్చర్ కూడా సొసైటీలో పెరుగుతోంది. దాంతో ఫుడ్ బిజినెస్ కొందరికి లాభసాటిగా మారింది. అన్నీ పర్‌ఫెక్ట్‌గా చేస్తే మిగిలేది ఏముంటుందనుకునే కక్కుర్తిగాళ్లు.. కస్టమర్ల ఆరోగ్యాలను ఫణంగా పెడుతున్నారు. టేబుల్‌ముందు కూర్చోబెట్టి అనారోగ్యాలు వడ్డించి పంపిస్తున్నారు.
ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?
ఫుడ్‌సేఫ్టీ అధికారులు వచ్చినప్పుడు జాగ్రత్తపడితే చాలన్నట్లుంది కొన్ని హోటళ్ల తీరు. అధికారులు కూడా నాలుగురోజులు హడావిడిచేసి సైలెంట్ అయిపోతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై నిరంతరం నిఘా పెట్టేందుకు ఇకపై జనాభా ప్రాతిపదికన కాకుండా హోటళ్ల సంఖ్య ఆధారంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లని నియమించాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో 74వేల900 రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి కాకుండా తగిన అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన హోటళ్లు, ఫుడ్ సెంటర్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఇంత భారీఫుడ్ బిజినెస్ జరుగుతున్నా మానవ వనరుల కొరతతో పర్యవేక్షణ అసలే ఉండటం లేదు. హైదరాబాద్‌లో ప్రతీ 3వేల 552 రెస్టారెంట్లకు ఒక ఆహార తనిఖీ అధికారి ఉన్నారంతే.
ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన
ఏది వండినా ఎలా వండినా చెల్లుతుందన్నట్లుంది ఫుడ్ బిజినెస్. ప్రజల ఆరోగ్యాలు ఏమైపోయినా ఫరక్ పడదన్నట్లు నిర్లక్ష్యం పెరిగిపోతోంది. ఎవరన్నా చెకింగ్‌కి వస్తేనే జాగ్రత్తపడుతున్నారు. అధికారులు వీపు తిప్పగానే షరామామూలైపోతోంది. నాసిరకం ఆహారపదార్థాలను గుర్తించినా అధికారుల చర్యలు తాత్కాలికమే అవుతున్నాయే తప్ప ఎవరికీ శిక్షలు భారీ జరిమానాలు పడేదాకా వెళ్లడంలేదు. అందుకే రొటీన్ దాడులన్నట్లు లైట్ తీసుకుంటున్నారు హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు. ఇక రోడ్‌సైడ్ బిజినెస్‌కైతే లెక్కాపత్రమే ఉండదు. ఉన్నచోట ఏదన్నా తేడావస్తే మరో చోట ప్రత్యక్షమవుతారంతే.
రాష్ట్రంలోని అనేక హోటళ్లలో ఈమధ్య టాస్క్‌ఫోర్స్ తనిఖీలు జరిగితే ఒకటీ అరా తప్పితే దాదాపుగా అన్నిచోట్లా నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోవడంలేదని తేలింది. అందుకే ఫుడ్‌సేఫ్టీకి సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులకు, పరిష్కారానికి కలెక్టరేట్లలో స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ని ఆధునీకరించటంతో పాటు వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకాబోతున్నాయి. ఇవికాకుండా మరో ఐదు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ని ప్రవేశపెట్టే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సంవత్సరానికి కనీసం 24వేల ఫుడ్ శాంపిల్స్ పరీక్షించేలా ల్యాబ్స్‌ని సిద్ధంచేయాలన్నది ప్రభుత్వ టార్గెట్. ఆరోగ్యాలు చెడిపోతాయని బయట తినకుండా ఉండరు. ఎందుకంటే అలవాటైన ప్రాణాలు ఆర్డర్లిస్తూనే ఉంటాయి. ప్రతీ హోటల్లో ప్రతీ ఐటమ్‌ని ప్రతిరోజూ అధికారులొచ్చి పరీక్షించడం కుదరదు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు.. పేరేదయినా ఫుడ్‌బిజినెస్‌లో ఉన్నవారు లాభాలు చూసుకోవడమే కాదు.. ప్రజల ఆరోగ్యాలు అంతకంటే ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాణ్యత పాటిస్తూనే ఆ స్టాండర్డ్స్‌కి తగ్గట్లు మెనూ మెయింటెన్ చేసుకుంటే ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు. తింటే ప్రాణాలు పోతాయేమోనని అందరూ భయపడే పరిస్థితే వస్తే.. బిర్యానీకి డబుల్ మసాలా వేస్తామన్నా, లెగ్‌పీస్ ఫ్రీగా ఇస్తామన్నా హోటళ్లలోకి అడుగుపెట్టేవారుండరు.
ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..