JNV Admissions: తెలుగు రాష్ట్రాల నిరుపేద విద్యార్ధులకు మరోఛాన్స్.. మళ్లీ పెరిగిన నవోదయ దరఖాస్తు గడువు
తెలుగు రాష్ట్రాల్లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు మరోమారు దరఖాస్తు గడువు పెంపొందిస్తూ కేంద్ర కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది. నవంబర్ 9వ తేదీతో తుది గడువు ముగియగా.. దానిని తాజాగా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది..
హైదరాబాద్, నవంబర్ 10: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ఖాళీల సీట్ల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు మరోమారు పెరిగింది. ఈ మేరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ ప్రకటనలో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 650 విద్యాలయాల్లో ఈ ప్రవేశాలు కల్పించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఎవరైనా జేఎన్‌వీ లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు గడువు పొడిగించి కేంద్రం తాజా పొడిగింపుతో నవంబర్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు నవంబర్ 9వ తేదీతో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో మరో 10 రోజుల వరకు విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 వరకు నవోదయ విద్యాలయాలు (జేఎన్‌వీలు) ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యాలు అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు వసతి ఉంటుంది. అర్హత కలిగిన విద్యార్ధులు ఎవరైనా గడువు తేదీలోగా ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి, 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
విజయవాడలో కిక్కిరిసిన లైబ్రరీలు.. మొదలైన డీఎస్సీ హంగామా!
ఏపీలో గత ఐదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు కోటి ఆశలతో నిరీక్షిస్తున్న క్రమంలో కూటమి సర్కార్ వచ్చిరావడంతోనే మెగా డీఎస్సీ నియామకంపై తొలి సంతకం చేసింది. ఇక త్వరలోనే మెగా డీఎస్సీ నోటిపికేషన్ కూడా వెలువడనుంది. దీంతో రాష్ట్రం నలుమూలల్లో డీఎస్సీకి సిద్ధమయ్యే యువత విజయవాడకు పోటెత్తుతున్నారు. నగరంలోని శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాలకు వరుస కట్టారు. ముఖ్యంగా విజయవాడలోని ఠాగూర్ లైబ్రెరీకి నిత్యం వందల సంఖ్యలో నిరుద్యోగులు వస్తున్నారు. ఇక్కడ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల గంటల వరకు చదువుకునే అవకాశం ఉంటుంది. పూగా డీఎస్సీకి సంబంధించిన సిలబస్, కరెంటు ఎఫైర్స్ పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. చక్కగా చదువుకోవడానికి వీలుగా ప్రత్యేక క్యాబిన్లు ఉంటాయి. కంప్యూటర్లు, ప్రింటర్లనూ వాడుకోవడానికి తక్కువ ధరతో ఏర్పాట్లు చేశారు. వేలకు వేలు వెచ్చించి కోచింగ్‌లు తీసుకోలేని వారు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు.