Hyderabad: షాకింగ్ ఘటన.. బతికున్న రోగి చనిపోయాడని చెప్పిన వైద్య సిబ్బంది.. ఆ తర్వాత ఏమైందంటే..?
Somajiguda private medical staff: హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. బతికున్న రోగి చనిపోయాడని చెప్పడంతో రోగి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతూ
Somajiguda private medical staff: హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. బతికున్న రోగి చనిపోయాడని చెప్పడంతో రోగి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతూ బంధువులకు సమాచారం ఇచ్చారు. తీరా శ్వాస తీసుకోవడం గమనించి వారు షాక్‌కు గురయ్యారు. అనంతరం వారు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ షాకింగ్ సంఘటన సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. చనిపోయాడని చెప్పిన అనంతరం.. బంధువులు రోగి శ్వాస తీసుకోవడం గమనించారు. అనంతరం పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పల్స్ చెక్ చేయగా 95 చూపించిందని రోగి బంధువులు తెలిపారు.
బాధితుల వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌కు చెందిన మహేందర్ అనే వ్యక్తి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు మొదట ఈసీఐఎల్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అడ్మిట్ చేసుకోలేదు. అనంతరం వారు సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మూడు రోజుల నుంచి చికిత్స అందిస్తు్న్నారు. ప్రస్తుతం రోగికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకూ చికిత్స కోసం రూ.3.5 లక్షలు చెల్లించినట్లు బాధితులు తెలిపారు.
ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది శనివారం మధ్యాహ్నం మహేందర్ మరణించాడని చెప్పి వెంటిలేటర్ తొలగించి బయటకు తీసుకువచ్చారు. దీంతో కుటుంబసభ్యులు రోదిస్తూ వారి బంధువులకు సమాచారమిచ్చి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అనంతరం మహేందర్ శ్వాస తీసుకోవడాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పల్స్ చూడగా బతికే ఉన్నాడని తేలింది.
దీంతో కుటుంబ సభ్యులు బతికున్న రోగిని చనిపోయాడని చెప్పిన ఆసుపత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రైవేటు హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. సమచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. బాధితులను సముదాయించి మహేందర్‌ను తిరిగి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు.
Also Read: