US Shooting: అమెరికాలో పెచ్చుమీరుతున్న తుపాకీ సంస్కృతి.. మళ్లీ పలుచోట్ల కాల్పులు.. 11 మంది మృతి..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Sep 06, 2021 | 9:04 AM

US Florida Shooting: అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. తాజాగా ఆ దేశంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలోని మేరిలాండ్‌ టౌసన్‌ యూనివర్సిటీ నిన్న

US Shooting: అమెరికాలో పెచ్చుమీరుతున్న తుపాకీ సంస్కృతి.. మళ్లీ పలుచోట్ల కాల్పులు.. 11 మంది మృతి..
Us Florida Shooting

Follow us on

US Florida Shooting: అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. తాజాగా ఆ దేశంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలోని మేరిలాండ్‌ టౌసన్‌ యూనివర్సిటీ నిన్న కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. ఈ ఘటన మరువకముందే దుండగులు ఈరోజు హ్యూస్టన్‌, ఫ్లోరిడాల్లో కాల్పులకు తెగబడ్డారు. అమెరికాలోని వేర్వేరు చోట్ల దుండగులు జరిపిన కాల్పుల్లో 11మంది మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. శని, ఆదివారం మొత్తం మూడు చోట్ల కాల్పులు జరిగినట్లు అమెరికా పోలీసు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, బాలింత ఉన్నారు.

ఫ్లోరిడాలోని లేక్‌ ల్యాండ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ సైకో తుపాకీతో కాల్పులకు తెగబడటంతో నలుగురు మృతిచెందారు. బుల్లెట్‌ప్రూఫ్‌ దుస్తులు ధరించి వచ్చిన సైకో లేక్‌ల్యాండ్‌లోని ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో11 ఏళ్ల బాలిక, బాలింత, ఆమె ఒడిలోని శిశువు మృతిచెందారు. పొరుగింట్లో ఉన్న మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. కాగా.. పోలీసులు.. ఆగంతుకుడిపై కాల్పులు జరిపి ప్రాణాలతో పట్టుకున్నారు. అయితే కాల్పులకు కారణం తెలియాల్సి ఉంది. అదేవిధంగా హూస్టన్‌లో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతిచెందారు. కాల్పుల అనంతరం ఆ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి నాలుగు మృతదేహాలను గుర్తించారు.

కాగా.. శనివారం రాత్రి అమెరికాలోని వాషింగ్టన్‌ వాయవ్య ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. లాంగ్‌ఫెలో వీధిలోని 600 బ్లాకులో బ్రైట్‌వుడ్‌ పార్కు సమీపాన ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Crime News: కన్న తండ్రి అమానుషం.. బాలికపై అత్యాచారం.. అది తెలిసి సోదరుడు..

Crime News: అమ్మా ఉద్యోగంతో తిరిగొస్తాం.. ఇవే చివరి మాటలయ్యాయి.. తీరా ఆ ఐదుగురు స్నేహితులు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu