Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వామ్మో.. బ్రెయిన్‌ నిండా కన్నింగ్‌ ఐడియాలే.. మీర్‌పేట్ మర్డర్ కేసులో సంచలన నిజాలు..

మనుషులున్నారు జాగ్రత్త.. ఒకడి టార్గెట్‌ 100- మరొకడి గురి 300.. స్నేహం ప్రేమ ముసుగులో కామోన్మాదాలు ..కులం కుల్లుతో పరువున్మోదాలు ...శరీరాలతో ఆడుకునే నీచులు.. శవాన్ని ఛిద్రం చేసే కాలంతాకులు ....వీళ్లు వాళ్లు మరెవరో కాదు..మనలో ఒకరు.. మన మధ్యే వున్నారీ నరరూప రాక్షసులు..సోసైటీలో యానిమల్‌ మార్క్‌.. ఎందుకిలా? నేరచరితలు కొత్త కాదు..కానీ మచ్చుకైనా మానవత్వంలేని ఈ హింస ఎందుకని?

Hyderabad: వామ్మో.. బ్రెయిన్‌ నిండా కన్నింగ్‌ ఐడియాలే.. మీర్‌పేట్ మర్డర్ కేసులో సంచలన నిజాలు..
Hyderabad Wife Murder Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 09, 2025 | 9:07 AM

DEXTER మూవీని మక్కీ మక్కీ కాపీ కొట్టి ప్రియురాలు శ్రద్దాను ముక్కలు ముక్కలు నరికేసి..ఫ్రిజ్‌లో పెట్టి.. ఒక్కో అవయవాన్ని పీస్‌ పీసులుగా చేసి .. పాలిథిన్‌ కవర్‌లు పెట్టి.. అడవిలే విసిరేశాడు…ఆఫ్తాబ్‌ ద బ్లడీఫెలో.. ఇక ఢిల్లీ ఆఫ్తాబ్‌ కి మించి హైదరాబాద్‌లో గురుమూర్తి క్రూరత్వం తెలుగు స్టేట్స్‌ను షాక్‌కు గురిచేసింది. మీర్ పేట్ లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. భార్య వెంకటమాధవిని అత్యంత పైశాచికంగా చంపి.. దృశ్యం సినిమా తరహాలో కేసును తప్పుదోవ పట్టించబోయిన వైనం క్రైమ్‌ హిస్టరీలోనే ఓ సంచలనం.

సంక్రాంతి రోజు వెంకటమాధవని తీసుకొని సినిమాకు వెళ్లాడు. ఇంటికొచ్చాక గొడవ పడ్డాడు. ఆమె తలను గట్టిగా గోడకేసి కొట్టాడు. మాధవి అక్కడక్కడే చనిపోయింది అనుకోకుండా జరిగిందా? ప్లాన్‌ ప్రకారమే చంపాడా?..క్షణికావేశంలో జరిగితే భయపడుతాడు. ఎవరికో ఒకరికి చెప్తాడు.లేదంటే పారిపోతాడు. కానీ గుర్తుమూర్తి అలా చేయలేదు. కాయగూరలు కోసినట్టుగా భార్య శవాన్ని ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల, మొండెం వేరు చేసి..ముక్కలుగా నరికి వాటిని పెనంపైన మాడ్చి.. పొడి చూసి.. బూడిదను బకెట్‌లో నింపి.. నింపాదిగా వెళ్లి.. చెరువులో కలిపేశాడు.. చెప్పడానికి వినడానికే ఒళ్లు జలదరించే విధంగా పైశాచికంగా వ్యవహరించాడు. మాజీ జవాన్‌ గురుమూర్తి క్రిమినల్‌ మెంటాల్టీ తెలిసి పోలీసులే షాకయ్యారు.

తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును సైంటిఫిక్ ఆధారాలతో ఛేదించారు పోలీసులు. నిందితుడు గురుమూర్తిని అరెస్ట్ చేసి .. BNS 103(1), 238, 85 సెక్షన్లకింద కేసు నమోదు చేశారు. హత్యకు ఉపయోగించిన 16 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో నిజాలు నిగ్గు తేలాయి. భార్యను చంపాలని ముందే నిర్ణయించుకున్న గురుమూర్తి, అనుకున్నట్టుగా ఆపరేషన్‌ ఫినిష్‌ చేశాడు. సాక్షాలు లేవు కాబట్టీ తనను నిర్వాకం బయటకు రాదనుకున్నారు. మిస్సింగ్‌ కేసుగా ఎంక్వయిరీ చేపట్టడంతో అతనిలో భయం మొదలైంది. నిజం బయటపడినా తను సేఫ్‌గా ఉండాలని మరో కన్నింగ్‌ ప్లానేశాడు. ఆవేశంలో కొట్టానని. భయంతో ఆనవాళ్లు మాయం చేశానని ఓ బంధువుకు చెప్పి ఎమోషనల్‌ గేమ్‌ ఆడాడు. గురుమూర్తి క్రిమినల్‌ మెంటాలిటీ ఎంత పీక్స్‌లో ఉందో చెప్పే నిదర్శనం అది. ఇంత చేశాడంటే వాడు మనిషా..మానవ మృగమా? మనుషుల్లో ఇలాంటి వికృత మనస్తత్వం ఎందుకొచ్చి చస్తుంది. అసలు గురుమూర్తి మెంటల్ హెల్త్‌ కండీషన్‌ ఏంటీ? అని పరిశీలిస్తే.. సైకోకు మించిన మెంటాలితో ఉంది..

అదీ సంగతి.అనుమానం పెనుభూతం అవుతుంది. పెరుగుతోన్న నేరాలతో పాటు గురుమూర్తిలాంటివారి పైశాచిక మస్తిష్కం ఆందోళన కల్గిస్తోంది. చూడ్డానికి స్మార్ట్‌గా..సిన్సియర్‌గా వున్నాడు. కానీ బ్రెయిన్‌ నిండా కన్నింగ్‌ ఐడియాలేని ఖాకీలే నివ్వెరపోయారు . ఫలానా వాడు మంచోడు.. చెడ్డొడని నుదుటి మీద రాసి వుండదు. సో..మంచోళ్లని ఎవర్నీ నమ్మోద్దు..మనుషులున్నారు జాగ్రర్త!!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..