Hyderabad: అచ్చంగా ‘ఫర్జీ’ వెబ్ సిరస్‌లాగే.. హైదరాబాద్‌లో వెలుగులోకి భారీ చీకటి భాగోతం
పోలీసులు ఎన్ని రకాల కఠిన చర్యలు చేపట్టినా నకిలీ నోట్ల దందాకు చెక్ పడడంలేదు. ఏదో కొత్త మార్గాన్ని ఎంచుకొని రెచ్చిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ భారీ నకిలీ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను శంషాబాద్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వీరి దగ్గరం మొత్తం...
పోలీసులు ఎన్ని రకాల కఠిన చర్యలు చేపట్టినా నకిలీ నోట్ల దందాకు చెక్ పడడంలేదు. ఏదో కొత్త మార్గాన్ని ఎంచుకొని రెచ్చిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ భారీ నకిలీ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను శంషాబాద్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వీరి దగ్గరం మొత్తం రూ. 11 లక్షల కరెన్సీని స్వాధీనం చేస్తున్నారు. శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏపీ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన తోమండ్ర రంజిత్ సింగ్, కొవ్వూరుకి చెందిన మలస్ల మోహన్ రావుని పట్టుకున్నాం.
ఈ ముఠా నకిలీ కరెన్సీ నోట్లను సొంతంగా తయారు చేస్తున్నారు. రూ. 50, 100, 200, 500 నోట్లు ప్రింట్ చేశారు. రూరల్ ఏరియాస్ లక్ష్యంగా నకిలీ కరెన్సీ చలామణీ చేశారు. రాత్రి వేళల్లో రద్దీగా ఉండే షాపుల్లో కూడా నోట్లను మార్చుతున్నారు’అని చెప్పుకొచ్చారు. ఇక ప్రింట్ చేసిన దొంగ నోట్లను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ముఠా తమ ఏజెంట్లకు 1:3 నిష్పత్తిలో పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దిరిని అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రస్తుతం వారి నుంచి సమాచారం రాబడుతున్నారు. వీరి వెనక ఎదైనా ముఠా హస్తం ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ముఠా నకిలీ నోట్ల ముద్రణ అచ్చంగా ఫర్జీ వెబ్ సిరీస్‌ను తలపిస్తోంది. బాలీవుడ్ ఇటీవలై విడుదలైన ఫర్జీ వెబ్ సిరీస్‌లో షాహీద్ కపూర్ నకిలీ నోట్లను తయారు చేసే పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ముఠా కూడా ఇలాగే దొంగ నోట్లను ముద్రించింది. నోట్ల తయారీ కోసం స్థానికంగా దొరికే కలర్స్, బాండ్ పేపర్, ప్రింటర్లు వాడారు. ఇక అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నోట్లను ముద్రించి.. శంషాబాద్ తొండుపల్లిలోని 5 స్టార్ గ్రాండ్ హోటల్ కేంద్రంగా ఏజెంట్లకు సర్క్యులేట్ చేస్తున్నారు. శంషాబాద్ కేంద్రంగా నోట్లు తయారు చేసేందుకు వచ్చిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరైన రంజిత్ సింగ్‌కు ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసిన అనుభవం ఉంది. అలాగే డీటీపీ ఆపరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నాలెడ్జ్ ద్వారానే దొంగ నోట్ల దందాకు తెర తీశాడు. ఫర్జీ సిరీస్‌లోనూ షాహిద్‌కు ప్రింటింగ్ ప్రెస్ పనిచేసిన అనుభవం ఉండడం కొసమెరుపు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..