Numaish 2022: మళ్లీ ప్రారంభం కానున్న నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌!.. ఎప్పటి నుంచంటే..

కరోనా (Corona) మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్‌ (Numaish) ఎగ్జిబిషన్‌) మళ్లీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Numaish 2022: మళ్లీ ప్రారంభం కానున్న నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌!.. ఎప్పటి నుంచంటే..
Hyderabad Numaish
Follow us
Basha Shek

|

Updated on: Feb 10, 2022 | 8:55 AM

కరోనా (Corona) మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్‌ (Numaish) ఎగ్జిబిషన్‌) ను మళ్లీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.. నాంపల్లి (Nampally) ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈ ఏడాది జనవరి 1న గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అయితే అదే రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా జనవరి 2 న రాత్రే ఈ ఎగ్జిబిషన్‌ను మూసేశారు. అయితే కరోనా శాంతించడంతో మళ్లీ నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ను పునఃప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎగ్జిబిషన్‌ సొసైటీ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు బుధవారం నుమాయిష్‌ నిర్వహణపై ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులో కమిట సభ్యులతో సహా వివిధ శాఖల ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 20 నుంచి ఎగ్జిబిషన్‌ను మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులు సొసైటీ కమిటీ సభ్యులకు సూచించినట్లు సమాచారం. కరోనా నిబంధనలు, ఆంక్షల మేరకు మార్చి ఆఖరి వరకు ఎగ్జిబిషన్‌ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు.

రెండు రోజుల్లో అనుమతులు..

కాగా నుమాయిష్‌ పునఃప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తామని, స్టాళ్ల నిర్వాహకులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. ఎగ్జిబిషన్‌ పునఃప్రారంభానికి నగర సీపీ ఆనంద్‌తో సహా అన్ని శాఖల ప్రభుత్వాధికారులు అనధికారికంగా అనుమతులు ఇచ్చారనన్నారు. రెండు రోజుల్లోనే అధికారిక అనుమతులు వస్తాయని, అన్ని కుదిరితే 20 నుంచి నుమాయిష్‌ను పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ ఆ తేదీ కుదరని పక్షంలో 25వ వ తేదీ నుంచి ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Also Read:Venkaiah Naidu: శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు వినతి..

Tirupati: వేల పాములకు ప్రాణాలు నిలిపిన పుణ్యం.. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు క్షేమం

UnstoppableWith NBK: మెగాస్టార్‌ ఎపిసోడ్‌ ఉండుంటే అన్‌స్టాపబుల్‌ మరో లెవెల్లో ఉండేది.. టాక్‌ షో డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే