Hyderabad: అయ్యో.. 4 రోజుల పసికందు కూడా! నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి..
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పరిధిలోని బజార్‌ఘాట్‌లో ఘోర అగ్ని ప్రమాదం ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటికే 9 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 4 రోజుల పసికందు కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పుట్టిన నాలుగు రోజులకే పసికందు అగ్నికి ఆహుతి కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కారు రిపేర్ గ్యారేజ్‌లో ఓ కారును రిపేర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు..

హైదరాబాద్, నవంబర్ 13: హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పరిధిలోని బజార్‌ఘాట్‌లో ఘోర అగ్ని ప్రమాదం ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటికే 9 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 4 రోజుల పసికందు కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పుట్టిన నాలుగు రోజులకే పసికందు అగ్నికి ఆహుతి కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కారు రిపేర్ గ్యారేజ్‌లో ఓ కారును రిపేర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి.
ఆ మంటలు కాస్తా పక్కనే ఉన్న డీజిల్, కెమికల్ డ్రమ్ములకు అంటుకోవడంతో మంటలు ఒక్కాసారిగా చెలరేగాయి. ఈ క్రమంలోనే గ్యారేజ్ నుంచి అపార్ట్‌మెంట్‌పై ఉన్న 4 అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో భవనమంతా అగ్నిగోళంలా మండిపోయింది. అప్పటికే పొగ దట్టంగా కమ్మేసింది. మూడు, నాలుగు అంతస్తుల్లో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. దీంతో అందులో ఉన్న వారంతా మంటల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ లోపల ఉన్న 9 మంది ఊపిరి ఆడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బందితోపాటు జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గ్యారేజ్‌లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను సిబ్బంది బయటకు తెచ్చారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది భవనంలోకి ప్రవేశించి మంటల్లో చిక్కుకున్న 21 మందిని కాపాడారు. వీరిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. వారందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నాలుగు రోజుల చిన్నారితో సహా 9 మంది మృతిచెందారు.
నాంపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నాంపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాంపల్లి అగ్నిప్రమాద ఘటనను పరిశీలించడానికి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకుని, పరిస్థితిని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానన్నారు. వీలైతే సోమవారం సాయంత్రంలోగా ప్రకటన చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








