Hyderabad: తెలంగాణలో టెర్రర్‌ జాడలు మధ్యప్రదేశ్‌ ATS విచారణలో కదిలిన ఉగ్రలింకుల డొంక

హైదరాబాదులో మళ్లీ టెర్రర్‌ లింకుల జాడలు. మొన్నీ మధ్యే మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ టీమ్స్‌ తెలంగాణలో జల్లెడపట్టాయి. లేటెస్ట్‌గా తెలంగాణ గుజరాత్‌ ATS సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అప్పుడు H.U.T లింక్స్‌..ఇప్పుడు ISKP టెర్రర్‌ నెట్‌వర్క్‌. అసలేంటి ఈ ISKP?

Hyderabad: తెలంగాణలో  టెర్రర్‌ జాడలు మధ్యప్రదేశ్‌ ATS విచారణలో  కదిలిన ఉగ్రలింకుల డొంక
Terrorists (representative)
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 28, 2023 | 10:06 PM

హైదరాబాద్‌ ..విశ్వనగరి. మినీ ఇండియా. ఎవరైనా రావొచ్చు..పోవచ్చు. ఉపాధి బాటలో ఇక్కడే ఉండొచ్చు. భద్రతకు ఢోకాలేదు. హమారా  హైదరాబాద్‌ మహాన్‌… ఇది ప్రతి ఒక్కరిమాట.  శాంతిభద్రతలకు ఇక్కడ అధిక ప్రాధాన్యత.కానీ..కానీ  ప్రశాంతంగా వున్న మహానగరంలో మళ్లీ ఉగ్ర లింకుల అలజడి. దేశంలో ఎక్కడ ఏ  టెర్రర్‌ యాక్టివిటీ  జరిగినా.. వాటి లింకులు హైదరాబాద్‌లో తెరపైకి వస్తున్నాయి. ఓ వైపు N.I.A..మరోవైపు యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌.. తెలంగాణలో విరివిగా సెర్చ్‌ ఆపరేషన్స్‌ చేపడుతున్నాయి. మొన్న  నిజామాబాద్‌లో కరాటే ముసుగులో  ఉగ్రశిక్షణ…. రీసెంట్‌గా వికారాబాద్‌ అడ్డాగా H.U.T టెర్రర్‌ క్యాంప్‌.. ఇప్పుడు ఆఫ్గాన్‌ బేస్డ్‌  ISKP టెర్రర్‌ యాక్టివిటీ.

ఇస్లామిక్‌ స్టేట్‌  ఖోరాసన్‌ ప్రావిన్స్‌..ISKP.. వేర్పాటువాద  ఉగ్రసంస్థ ఆఫ్టాన్‌ కేంద్రంగా టెర్రర్‌ యాక్టివిటీస్‌ చేపడుతున్న ISKP లింకులు ఇండియాలోనూ బటయటపడ్డాయి. ISKP మద్దతుగా భారత్‌లో పలుచోట్ల ఉగ్రశిక్షణ ఇస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలోనే ఇటీవల పోరుబందర్‌లో  ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు  గుజరాత్ పోలీసులు . పట్టుబడిన వారిలో  ముగ్గురు కాశ్మీర్ యువకులతో పాటు సూరత్ కు చెందిన ఒక మహిళను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె పేరు సువేరా భాను.

సువేరా భాను చదివింది ఇంటర్మీడియట్, కానీ టెర్రర్‌ యాక్టివిటీస్‌లో ఎక్స్‌పర్ట్‌  అనే నిజాలు దర్యాప్తులో వెలుగుచూస్తున్నాయి. ISKP మద్దతుగా యువతను చేరదీయడం..వారికి ఉగ్రశిక్షణ ఇవ్వడం..వారిని ఆఫ్గాన్‌కు తరలించడం..ఇదీ సూరత్‌కు చెందిన టెర్రర్‌ మాస్టర్‌మైండ్‌  మున్షి డైరెక్షన్‌లో సువేరా భాను సీక్రెట్‌ మిషన్‌.  మున్షి సూచనల ప్రకారం  సముద్రమార్గంలో ఇరాన్‌కు అక్కడి నుంచి ఆఫ్గాన్‌కు చేరాలనే ప్లాన్‌తో బయలుదేరారు. కానీ పోరుబందర్‌లో గుజరాత్‌ పోలీసులకు చిక్కడం కథ అడ్డం తిరిగింది. గుజరాత్‌ ఏటీఎస్‌కు చిక్కిన ఆ ఐదుగుర్ని ఇంటరాగేట్‌ చేస్తే  సువేరాభాను నిఖానామాతో  హైదరాబాద్‌..చెన్నై లింకులు కదిలాయి.  సువేరా భానుకు తమిళనాడు వ్యక్తితో పెళ్లయింది. మధ్యవర్తి హైదరాబాదీ ఫజీయుల్ల. సువేరా భాను పెళ్లి పెటాకులైంది. కానీ మధ్యవర్తి ఫజీతో ఆమె బాత్‌చీత్‌ కంటిన్యూ అవుతూనే ఉండడం  గుజరాత్‌ ఏటీఎస్‌ కంటపడింది. కట్‌ చేస్తే  హైదరాబాద్‌ సహా తెలంగాణలో  గుజరాత్‌ ఏటీఎస్‌ టీమ్స్‌ తనిఖీలు తెరపైకి వచ్చాయి మున్షి, సువేరాభాను సహా అరెస్టయిన ఐదుగురు  ISKP టెర్రర్‌ మాడ్యూల్‌ కోసం పనిచేస్తున్నట్టు  గుజరాత్‌ పోలీసులు నిర్దారించారు. మున్షి, సువేరా భాను నుంచి సేకరించిన వివరాలతో హైదరాబాద్‌లో సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టారు. సిఆర్పిసి 160 కింద ఫజీకి నోటీసులు ఇచ్చి పదిగంటల పాలు కాలపత్తార్‌ పీఎస్‌లో అతన్ని ప్రశ్నించారు. ఇక గోదావరిఖనిలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు గుజరాత్ పోలీసులు. హైదరాబాద్ టోలిచౌకిలో నివాసముండే జావిద్ తో పాటు అతని కుమార్తె ఖాటీజాను అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేటలోని ఓ సాఫ్ట్‌వేర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే జావెద్‌కు టెర్రర్‌ లింకులేంటి? మాస్టర్‌ ముసుగులో యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నాడా?  కాలపత్తార్‌ ఫజీ కతేంటి? సవేరా భానుతో కలిసి హైదరాబాద్‌లో టెర్రర్‌ ట్రైనింగ్‌కు ఊతం ఇచ్చాడా? పిన్‌ పాయింట్‌గా కూపీలాగుతున్నారు గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు

H.U.T  నెట్‌వర్క్‌లో  దక్కన్‌ కాలేజీ ప్రొఫెసర్‌ సలీమ్‌ అరెస్ట్‌..ఇప్పుడు ISKP టెర్రర్‌ లింక్స్‌లో సాప్ట్‌వేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ట్రైనర్‌ జావేద్‌…. ఇలాంటి మాస్టర్‌ మైండ్‌లు ఇంకెందరున్నారు? ..N.I.A  లేదంటే ఇతర రాష్ట్రాల ఏటీఎస్‌ టీమ్స్‌ మెరుపు తనిఖీలు చేపట్టినప్పుడే ఇలాంటి ఉగ్రతీగలు తెరపైకి వస్తున్నాయంటే అర్ధమేంటి? స్థానికంగా  ఉగ్రవాదంపై ఉక్కుపాదం పక్కకు తొలిగిందా? నిఘా అటకెక్కిందా?.. అనే అనుమానాలు,విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రగతి సరే విశ్వనగరిపై మత్తు, ఉగ్ర మరకలు పడకుండా విద్రోహశక్తులపై  ఇకనైనా ఓ కన్నేసి వుంచాలనేది పబ్లిక్‌ డిమాండ్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.