Jubliee Hills Rape Case: ఇన్నోవా కారు అతనిదే.. జూబ్లీహిల్స్ రేప్ కేసులో సంచలన వాస్తవాలు..
బాలిక అత్యాచారానికి గురైన ఇన్నోవా కారు వక్ఫ్ బోర్డు చైర్మన్ సొంత వాహనంగా తేల్చారు. సొంత వాహనానికి ప్రభుత్వ వాహనమని స్టిక్కర్ వేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది.
Hyderabad Gangrape Case: హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ (17) బాలిక అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మైనర్‌ల కస్టడీ ముగిసింది. ఇప్పటి వరకు 17 మంది సాక్షులను గుర్తించిన పోలీసులు ఏడుగురిని విచారించారు. దర్యాప్తు సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. మైనర్ బాలికను తీసుకెళ్లిన బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లే నడిపినట్టు గుర్తించారు. బెంజికారు యజమానిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక అత్యాచారానికి గురైన ఇన్నోవా కారు వక్ఫ్ బోర్డు చైర్మన్ సొంత వాహనంగా తేల్చారు. సొంత వాహనానికి ప్రభుత్వ వాహనమని స్టిక్కర్ వేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. డ్రైవర్‌తో పాటు ఇనోవా కారు పంపితే డ్రైవర్ ను వెనిక్కి పంపి కారును మైనర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలు విషయం వెలుగులోకి ఇలా..
వక్ఫ్ చైర్మన్ కుమారుడిని డ్రైవర్ ఇన్నోవాలో పబ్‌కు తీసుకెళ్లాడు. పబ్ నుంచి తన స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్లాడు. బేకరీ వద్ద డ్రైవర్‌ను వదిలిపెట్టి మైనర్ వాహనాన్ని తీసుకోని.. అందులో బాలికతో పాటు మరో ఐదుగురిని ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఓ మైనర్ బాలుడు దిగిపోగా, మిగతా ఐదుగురు కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44 వద్దకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాలికను పబ్ వద్ద వదిలేసి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన బాలిక మెడపై గాయాలను గుర్తించిన తల్లి బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. గాయాల గురించి బాలిక స్నేహితుడిని ప్రశ్నించగా.. పబ్‌లో ఆరుగురు కలిసి బాలికను తీసుకెళ్లినట్టు తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం జరిగినట్టు గుర్తించిన తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే బంధువుల బెదిరింపులు..
అయితే.. తమ కూతురుపై ఎవరు అఘాయిత్యానికి పాల్పడ్డారో చెప్పాలని.. బాలికను తీసుకెళ్లిన యువకుడిని బాలిక తల్లిదండ్రులు ప్రశ్నించారు. అయితే.. బాలికను తీసుకెళ్లింది ఎమ్మెల్యే బంధువు కుమారుడని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుల తల్లిదండ్రులకు బాలిక తండ్రి కాల్ చేయగా ఎమ్మెల్యే బంధువులు బెదిరింపులు దిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..