Hyderabad: హైదరాబాద్‌ ఈఎస్‌ఐలో హృద్రోగులు సేఫ్.. మూడు నెలల పాటు గుండెకు వ్యాయామం..

గుండె జబ్బు వచ్చిందంటే లేచి నాలుగడుగులు వేస్తేనే ఆయాసం వస్తుంది. ఏదైనా పని చేయాలన్నా ఒత్తిడి పెరుగుతుందేమో అని గాబరా పడిపోతారు. సర్జరీలు చేయించుకున్నవాళ్ల పరిస్థితైతే ఇంకా బాధాకరం. అటువంటి కష్టాలకు చెక్ పెట్టేద్దాం రండి... అంటున్నారు కార్డియాలజిస్టులు.

Hyderabad: హైదరాబాద్‌ ఈఎస్‌ఐలో హృద్రోగులు సేఫ్.. మూడు నెలల పాటు గుండెకు వ్యాయామం..
Cardiac Rehabilitation(representative image)
Follow us

|

Updated on: Sep 29, 2022 | 5:37 PM

ఒకవైపు కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తుంటే… మరోవైపు క్లినికల్ పరంగా రిసెర్చ్‌లు పెరిగి మెడికల్ టెక్నాలజీ కూడా అప్‌డేట్ అవుతూనే ఉంది. ప్రధాన ఆర్గాన్ గుండెకి సంబంధించిన చికిత్సలో అయితే.. ఇంకాఇంకా అడ్వాన్స్‌ అవుతూనే ఉన్నాం. సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా… గుండెకు స్వాంతన కలిగించే తాజా ట్రీట్‌మెంట్ పేరే కార్డియాక్ రిహాబిలిటేషన్. హైదరాబాద్‌ ESI మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో కార్డియాక్ రిహాబ్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటైంది. ప్రభుత్వరంగంలో దేశంలోకెల్లా ఇది మొట్టమొదటి యూనిట్. గుండె పనితీరు, సామర్థ్యం తగ్గిన వాళ్లలో కార్డియాక్ రీహాబ్ సెంటర్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. దీంతో గుండె సామర్థ్యం పెరిగి గతం కంటే చురుగ్గా పనిచేసే ఛాన్సుంది. కార్డియాక్ రిహాబ్‌… మూడు అంచెల్లో జరుగుతుంది. సర్జరీ జరిగిన తర్వాత… సదరు పేషెంట్ గుండె పనితీరు ఏ విధంగా ఉందనేది మోనిటర్ చేస్తారు. గుండె సామర్థ్యాన్ని అంచనా వేసి ఎక్సర్‌సైజ్ చేసేందుకు ఒక సేఫ్ జోన్ నిర్ధారిస్తారు. మూడు నెలల పాటు వ్యక్తి గుండెకు కావాల్సిన వ్యాయామం చేయిస్తారు. అ తర్వాత పేషెంట్ గుండె పనితీరు మెరుగుపడుతుందంటున్నారు డాక్టర్లు.

ఆపరేషన్ జరిగిన తర్వాత హార్ట్‌ పేషెంట్స్‌ భయంభయంగా బతికే అవసరం లేకుండా కాపాడుతుంది ఈ కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌. ఎక్కువగా హాస్పిటల్ కి వెళ్లాల్సిన అగత్యం కూడా ఉండదు. మరీ ముఖ్యంగా గుండె ఆపరేషన్ తర్వాత వచ్చే చిన్నచిన్న సమస్యలు తొలగిపోయే ఛాన్సుంది. ఇప్పటివరకు కార్డియాక్ రిహాబ్ చికిత్స తీసుకున్నవారు గుండె ఆపరేషన్ తరవాత… మారథాన్‌లలో కూడా పాల్గొంటూ ముందటి కంటే జోష్‌గా కనిపిస్తున్నారట.

ఈఎస్ఐ కార్డియాక్ రిహాబ్ సెంటర్లో చికిత్స తీసుకున్న పేషెంట్స్ దగ్గర అటువంటి సంతృప్తే కనిపిస్తోంది. హార్ట్‌ ఆపరేషన్ తర్వాత తమ లైఫ్ గురించి ఆందోళన పడ్డామని, ఇప్పుడు అటువంటి టెన్షనే లేదని, మిగతా వారితో సమానంగా తామూ రెగ్యులర్ లైఫ్‌ లీడ్‌ చేస్తున్నామని చెబుతున్నారు.  కార్డియాక్ రిహబ్ సెంటర్‌… ప్రస్తుతానికి హైదరాబాద్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో మాత్రమే అందుబాటులో ఉంది. మరిన్ని సెంటర్లు ఏర్పాటైతే ప్రజారోగ్యం మెరుగవుతుంది. హృద్రోగుల్లో హైరానా తగ్గించవచ్చు. గుండెకు సర్జరీ చేయించుకున్నవాళ్లకు మరింత భరోసానివ్వొచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్