AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆపరేషన్‌ రోప్‌.. నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు ఇక ఎండ్‌ కార్డ్‌..

నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు ఇక ఎండ్‌ కార్డ్‌ పడనుందా? గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని విలవిల్లాడే స్థితి మారనుందా? అవుననే అంటున్నారు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌.

Hyderabad: ఆపరేషన్‌ రోప్‌.. నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు ఇక ఎండ్‌ కార్డ్‌..
Hyderabad Traffic Police
Ram Naramaneni
|

Updated on: Sep 29, 2022 | 8:43 PM

Share

వాహనాల రద్దీని తగ్గించి, నగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆపరేషన్‌ రోప్‌తో ట్రాఫిక్‌ ఇబ్బందులనుంచి జనాన్ని కాపాడేందుకు సంసిద్ధం అవుతున్నారు. రోడ్డుకి అడ్డంగా ఉన్న ఎలాంటి నిర్మాణాలనైనా తొలగించేందుకు హైదరాబాద్ సీపీ ఆనంద్‌ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.  ఆపరేషన్‌ రోప్‌ అంటే, రిమూవల్‌ ఆఫ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌, అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌. ఇదే ఇప్పుడు హైదరాబాద్‌ వాసుల ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టబోతోంది. హైదరాబాద్‌లోని పార్కింగ్‌, ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై దృష్టిసారించబోతోంది. ఇష్టారాజ్యంగా పార్కింగ్‌లు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్టు హైదరాబాద్‌ సీపీ వెల్లడించారు.

మల్టీప్లెక్స్‌లలో 60 శాతం, మాల్స్‌లో 60 శాతం, కమర్షియల్‌ బిల్డింగ్స్‌లో 40 శాతం, అపార్ట్‌మెంట్‌లలో 30 శాతం పార్కింగ్‌ ఏరియాని కచ్చితంగా అమలుచేస్తామన్నారు సీపీ ఆనంద్‌. జీహెచ్‌ఎంసీతో కలిసి ఈ యాక్షన్‌ ప్లాన్‌ అమలుచేయబోతున్నట్టు తెలిపారు.ఫుట్‌పాత్‌ని వదిలేసి, రోడ్డుపైకి వచ్చి, వ్యాపారాలు చేస్తోన్న వారి పనిపట్టేందుకు సైతం ప్లాన్‌ సిద్దం చేస్తున్నారు. ఆర్టీసీ బస్‌లకోసం బస్‌బేల ఏర్పాటుపై అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పక పాటించేలా చర్యలు చేపడుతామన్నారు సీపీ ఆనంద్‌. ఇక స్టాప్‌ లైన్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.  పార్కింగ్ సౌకర్యం లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై సీరియస్ యాక్షన్ ఉంటుందని తెలిపారు.

డయల్‌ 100కి వస్తోన్న ఫోన్లలో 70 నుంచి 80 శాతం ఫోన్లు ట్రాఫిక్‌ సమస్యలవేనంటే ట్రాఫిక్‌ ఇష్యూ ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది. స్కూల్‌ కాలేజీ పరిసర ప్రాంతాల్లో మేనేజ్‌మెంట్‌లతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు సీపీ ఆనంద్‌. కరోనా వచ్చిన తరువాత  వాహనాల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ఇక నగరంలో సైబర్ క్రైమ్, డ్రగ్స్, ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్ పెడతామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..