Hyderabad Drugs Case: అందుకే పబ్‌కి వెళ్లా.. డ్రగ్స్ కోసం కాదు.. జూనియర్ ఆర్టిస్ట్ కుషిత వెర్షన్ ఇదీ..
Hyderabad Pub Raid: తనపై వచ్చిన వార్తలను ఖండించారు జూనియర్ ఆర్టిస్ట్ కుషిత. పబ్‌కి వచ్చిన వాళ్లందరినీ బద్నామ్ చేయడం సరికాదన్నారు. పబ్బులో ఉన్నంత మాత్రాన డ్రగ్స్ వాడినట్టు ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు.
Hyderabad Pub Raid: తనపై వచ్చిన వార్తలను ఖండించారు జూనియర్ ఆర్టిస్ట్ కుషిత. పబ్‌కి వచ్చిన వాళ్లందరినీ బద్నామ్ చేయడం సరికాదన్నారు. పబ్బులో ఉన్నంత మాత్రాన డ్రగ్స్ వాడినట్టు ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. తనపై ప్రచారం చేయడం ఆపాలని వేడుకున్నారామె. టీవీ9 ప్రతినిధితో మాట్లాడిన కుషిత.. మ్యూజిక్ ఎంజాయ్ చేసేందుకు పబ్ కి వెళ్ళినట్లు చెప్పుకొచ్చారు. తనను ఎవరూ ఐడి ప్రూఫ్ అడగలేదని చెప్పారు. తన స్నేహితుడు హర్ష డ్రగ్స్ కేసులో ఉన్నట్టు తెలియదని.. హర్ష కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికే వచ్చాడని చెప్పారు.
ఆఫ్టర్ పార్టీని ఎంజాయ్ చేయాలనేదే హర్ష ఇంటెన్షన్…డ్రగ్స్ కొరకు హర్ష వెళ్ళలేదన్నారు కుషిత. హర్ష ద్వారానే తన చెల్లి, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్ళినట్లు తెలిపారు. తమ గ్రూప్ లో ఉన్నవారు ఎవరు డ్రగ్స్ తీసుకోలేదన్నారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయట పడతాయన్నారు. పార్టీకి వెళ్లినందుకు ఇంట్లో తల్లిదండ్రులు మందలించారని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి పార్టీలకు వెళ్ళబోనన్నారు.
పబ్‌లోకి వెళ్లాలంటే నిబంధనల మేరకు 21 ఏళ్లు నిండాలి. కానీ కుషిత వయస్సు 20 సంవత్సరాలే. అధార్ కార్డ్‌లోనూ అదే ఉంది. అలాంటప్పుడు ఆమెను పబ్‌లోకి ఎలా అనుమతించారు? అసలు యాజమాన్యం ఫ్రూఫ్స్ అడిగిందా? లేదంటే ఎవరైనా మ్యానేజ్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. కుషిత మాత్రం కేవలం మ్యూజిక్ సెట్టింగ్ చూసేందుకు మాత్రమే వెళ్లానంటోంది.
కుషిత ఇంకా ఏమన్నారంటే..