AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains in Telangana: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి వార్త.. రాగల మూడు రోజుల్లో వర్షాలు

భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ(Telangana) ప్రజలకు వాతావరణశాఖ చల్లటి వార్త చెప్పింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో...

Rains in Telangana: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి వార్త.. రాగల మూడు రోజుల్లో వర్షాలు
Rains
Ganesh Mudavath
|

Updated on: Apr 04, 2022 | 6:32 PM

Share

భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ(Telangana) ప్రజలకు వాతావరణశాఖ చల్లటి వార్త చెప్పింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. శ్రీలంక(Sri Lanka) సమీపంలో కొమరీన్ ప్రాంతంపై బంగాళాఖాతంలో అల్పపీడనం(Low Pressure) ఆవరించి ఉంది. ఇది తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతోనే ఈ రోజు భారీ వర్షాలు, రేపటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ లో సూర్యుడు సుర్రుమంటున్నాడు. దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రలో పొడి వాతావరణం, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.

Also Read

Hyderabad Drugs Case: అందుకే పబ్‌కి వెళ్లా.. డ్రగ్స్ కోసం కాదు.. జూనియర్ ఆర్టిస్ట్ కుషిత వెర్షన్ ఇదీ..

China Corona: కరోనా కట్టడికి రంగంలోకి దిగిన సైన్యం.. లాక్ డౌన్ తో ఆఫీస్ లలోనే ఉద్యోగులు

Health Photos: గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!