Hyderabad: హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. ఆ పీఎస్‌లోని మొత్తం సిబ్బంది బదిలీ.. కారణం ఇదే..
తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే ఇదో సంచలనం.. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే ఇదో సంచలనం.. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పీఎస్‌లోని మొత్తం 85 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇన్‌స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో.. తొలిసారి పీఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీచేస్తూ.. సీపీ శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇలా స్టేషన్ మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారని పేర్కొంటున్నారు.
కాగా.. మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడి కేసే దీనికి కారణమని పోలీస్ డిపార్ట్‌మెంట్ లో వినిపిస్తోంది. పంజాగుట్ట ప్రజా భవన్ దగ్గర బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విధ్వంసం సృష్టించాడు. అనంతరం వెంటనే పంజాగుట్ట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, మాజీ ఎమ్మెల్యే షకిల్ ఎంటర్ కావడంతో బోధన్, పంజాగుట్ట సీఐలు మాట్లాడుకుని.. షకిల్ కుమారుడిని వదిలిపెట్టారు. అతని స్థానంలో షకిల్ ఇంట్లో పనిమనిషిని కేసులో చేర్చారు. వెంటనే షకిల్ కుమారుడు విదేశాలకు పరారయ్యాడు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారగా.. పంజాగుట్ట సీఐ సహా.. పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు.
ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇప్పటికే బోధన్ సీఐను అరెస్టు చేశారు. సస్పెండ్ అయిన సీఐ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, అతని కుమారుడు.. సీఐలతోపాటు.. పలువురి పేర్లను చేర్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
