AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నడిరోడ్డుపై ఆటోలో రెచ్చిపోయిన జంట.. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా..?

హైదరాబాద్‌ నగరం పాతబస్తీ పరిధిలోని చాదర్‌ఘాట్‌ ప్రాంతంలో ఆటోలో ఓ జంట సిగ్గు లేకుండా బరితెరిగించింది. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి మీదుగా వెళ్తూ ఏకంగా ఆటోలోనే డ్రైవర్ సీటులో అందరూ చూస్తుండగా రొమాన్స్ చేశారు. ఈ తంతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

Hyderabad: నడిరోడ్డుపై ఆటోలో రెచ్చిపోయిన జంట.. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా..?
Hyderabad Crime News
Noor Mohammed Shaik
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 09, 2025 | 9:59 AM

Share

రోజురోజుకీ మనిషి మానవత్వ విలువలు కోల్పోతున్నాడు.. వావి వరసలు వదిలేస్తూ.. బహిరంగ ప్రదేశాల్లోనే విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ.. ఏది చేయాలో ఏది చేయకూడదో అనే కనీస ఙ్ఞానం కూడా మర్చిపోతున్నాడు.. ఫేమస్ అవ్వడానికి ఏదైనా చేస్తూ కొందరు అడ్డంగా బుక్కవుతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో నడిరోడ్డుపై ఆటోలో రొమాన్స్ చేసుకుంటూ వెళ్తున్న ఓ జంట బాగోతం చూశాం.. ఇప్పుడు ఆ జంట పని పెట్టే చర్యలు ప్రారంభయ్యాయి.. ఈ అసభ్యకర ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు.

హైదరాబాద్‌ నగరం పాతబస్తీ పరిధిలోని చాదర్‌ఘాట్‌ ప్రాంతంలో ఆటోలో ఓ జంట సిగ్గు లేకుండా బరితెరిగించింది. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి మీదుగా వెళ్తూ ఏకంగా ఆటోలోనే డ్రైవర్ సీటులో అందరూ చూస్తుండగా రొమాన్స్ చేశారు. ఈ తంతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆటో ముందు భాగంలో ఓ అమ్మాయిని తనపై కూర్చోబెట్టుకుని రొమాన్స్ చేస్తూ ఆటో నడుపుతూ కనిపించాడు ఓ యువకుడు.. ఇది చూసినవాళ్ళంతా వీళ్లకు ఇదేం పోయే కాలమంటూ తిట్టిపోశారు. పైగా పక్కన వెళ్తున్న వాహనదారులు ఈ చండాలాన్ని వీడియో రికార్డు చేస్తున్నా.. చూస్తూ నవ్వుతున్నాడే తప్ప తను చేస్తున్న పనిని ఆపలేదు. ఇలాంటివారిని ఏం చేసినా తప్పు లేదని.. అసలు ఎవరు ఏమనుకుంటారో అనే కనీస ఙ్ఞానం కూడా వీళ్లకు లేదా.. నగరంలో చట్టం, శాంతిభద్రతలు ఏమయ్యాయంటూ ఫైర్ అయ్యారు.

Hyderabad Police

Hyderabad Police

అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై పోలీసులు వేగంగా స్పందించారు. చాదర్‌ఘాట్ బ్రిడ్జ్‌పై యువతితో రొమాన్స్ చేస్తూ ఆటో నడిపిన డ్రైవర్ నల్గొండ జిల్లాకు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడిగా గుర్తించారు. మైనర్ డ్రైవర్, తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చాదర్‌ఘాట్ పోలీసులు హెచ్చరించారు.

సోషల్ మీడియాలో రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్లు, అసభ్యకర వీడియోలు తీయొద్దని హైదరాబాద్ సిటీ పోలీసులు, చాదర్‌ఘాట్ పోలీసులు యువతకు హెచ్చరికలు జారీ చేశారు. చాలా తొందరగా ఫేమస్ అయిపోవాలని, దాని కోసం ఏమైనా చేయడానికి యువత సిద్ధపడుతోందని.. ఇలాంటివి ఈ మాత్రం సహించబోమని హెచ్చరించారు. సభ్య సమాజాన్ని తల దించుకునే ఏ సంఘటనలు అయినా, సొంత లాభం కోసం పక్కవాళ్లను ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి కార్యకలాపాలకు అయినా కఠిన శిక్షలు ఉంటాయని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..