Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో బీదర్ దోపిడి దొంగల పైరింగ్.. ఒకరికి గాయాలు
అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ప్రైవేట్ ట్రావెల్స్ మేనేజర్‌పై దుండగుల కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినవారిని బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు. ఉదయం బీదర్‌లో భారీ దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన వాహనంపై కాల్పలు జరిపి.. ఇద్దరు గార్డులను చంపి.. సొత్తు ఎత్తుకెళ్లారు.
బుధవారం ఉదయం బీదర్‌లో ఏటీఎంలో డబ్బులు జమచేసే వాహనంపై దాడి చేసి.. ఇద్దరు గార్డులను చంపి సొత్తు దోచుకుపోయిన దొంగలు హైదరాబాద్‌లోనూ కలకలం రేపారు. దొంగలను వెతుక్కుంటూ వచ్చిన బీదర్ పోలీసులపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, ముఠాలో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. సిటీలోని అఫ్జల్‌గంజ్‌లో సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బీదర్‌లో సొమ్ము కాజేసిన దొంగలు.. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ వచ్చి రాయ్‌పూర్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. సాయంత్రం వారు బస్ కోసం ఉన్న సమయంలో ట్రావెల్స్ మేనేజర్‌కు అనుమానం వచ్చి బ్యాగ్ చెక్ చేసేందుకు యత్నించాడు. అతనితో మాట్లాడుతుండగానే.. బీదర్ పోలీసులు రావడంతో వారిపై రెండు రౌండ్లు ఫైరింగ్ జరిపారు దుండగలు. ముఠా జరిపిన కాల్పుల్లో ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అతడ్ని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రత్యక్ష సాక్షి అహ్మద్ చెప్పిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి రోషన్ ట్రావెల్స్‌లో టికెట్లు రాయపూర్‌కు బుక్ చేశారు. తిరిగి సాయంత్రం ఏడు గంటలకు ట్రావెల్స్ ఆఫీసు వద్దకు వచ్చారు. అక్కడ నుంచి వారిని మినీ బస్సుల్లో బస్సులు ఆగే పాయింట్ వద్దకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇదే సమంయలో ట్రావెల్స్ సిబ్బంది అనుమానంగా ఉన్న బ్యాగ్ చెక్ చేయడానికి ట్రై చేశారు. అదే అయితే వారు డబ్బులు తీసి ట్రావెల్స్ సిబ్బందికి ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అదే మినీ బస్సులో ఉన్న కర్ణాటక పోలీసులు తాము పోలీసులమని ట్రావెల్స్ సిబ్బందికి చెప్పారు. దీంతో తత్తరపాటుకు గురైన దొంగలు బ్యాగులో నుంచి తుపాకీ తీసి కాల్పులు జరపారు. దీంతో మేనేజర్ జహంగీర్‌కు పొత్తికడుపుతో పాటు కాలికి గాయాలయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..