Numaish Reopen: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ప్రారంభమైన నాంపల్లి ఎగ్జిబిషన్‌.. టైమింగ్స్ ఇవే..

హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో శుక్రవారం నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన పునః ప్రారంభమైంది. కరోనా తీవ్రత కారణంగా వాయిదా పడ్డ ఎగ్జిబిషన్‌ ఇవాళ్టి నుంచి..

Numaish Reopen: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ప్రారంభమైన నాంపల్లి ఎగ్జిబిషన్‌.. టైమింగ్స్ ఇవే..
Numaish Reopen
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 25, 2022 | 8:07 PM

హైదరాబాద్‌(Hyderabad) నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో(Nampally Exhibition Grounds) శుక్రవారం నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(Annual trade fair) నుమాయిష్(Numaish) పునః ప్రారంభమైంది. కరోనా తీవ్రత కారణంగా వాయిదా పడ్డ ఎగ్జిబిషన్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. 46 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి పదిన్నర దాకా ఉంటుంది. దీనికి వచ్చే సందర్శకుల తాకిడి నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీసులు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇవి అమలులో ఉంటాయి. సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకూ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. నుమాయిష్‌లో దాదాపు 16 వందల స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో గత 81 ఏళ్లుగా నిరాటకంగా కొనసాగుతోంది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన.. జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగాల్సిన ఈ ఎగ్జిబిషన్‌ కరోనా తీవ్రత కారణంగా వాయిదా పడి కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.

గత ఏడాది కూడా నిర్వహించకపోవడంతో ఈసారి అందరూ నగర ప్రజలు ఎప్పుడెప్పుడు ఎగ్జిబిషన్‌ ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తూ వచ్చారు.. సందర్శకులు కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు అధికారులు. మాస్క్‌, శానిటైజేషన్‌, థర్మల్‌ స్ర్కీనింగ్‌ తర్వాతే ఎగ్జిబిషన్‌కు అనుమతినిస్తారు.

ట్రాఫిక్ ఆంక్షలు..

ఎస్‌ఏ బజార్, జామ్‌బాగ్‌ల వైపు నుంచి ఎంజే మార్కెట్‌ మీదుగా నాంపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ బస్సులు, భారీ వాహనాలను ఎంజే మార్కెట్‌ నుంచి అబిడ్స్‌ మీదుగా మళ్లిస్తారు. పోలీసు కంట్రోల్‌ రూమ్, ఫతేమైదాన్‌ వైపు నుంచి నాంపల్లి, ఎంజే మార్కెట్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ బస్సులు, భారీ వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి బీజేఆర్‌ స్టాట్యూ వైపు పంపిస్తారు.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War: ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తాం.. యూరప్, అమెరికాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్..

 Dental Care: దంతాలు పసుపురంగులో ఉన్నాయా..? అయితే ఈ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలు తెల్లగా మారిసిపోతాయి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?