Hyderabad: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. మార్చి 1నుంచి ప్రారంభం.. ఈనెల 28న అంకురార్పణ
Hyderabad:హైదరాబాద్ జూబ్లీహిల్స్ కొండ(Jubilee Hills) పై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి(venkateswara swamy temple) బ్రహ్మోత్సవాలను(Brahmotsavam) ఘనంగా నిర్వహించడానికి టీటీడీ(TTD) అధికారులు..
Hyderabad:హైదరాబాద్ జూబ్లీహిల్స్ కొండ(Jubilee Hills) పై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి (venkateswara swamy temple) బ్రహ్మోత్సవాలను(Brahmotsavam) ఘనంగా నిర్వహించడానికి టీటీడీ(TTD) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని టీటీడీ అధికారులు చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు స్వామివారికి వాహనసేవలు నిర్వహిస్తారు. అనంతరం మార్చి 10న సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు:
01-03-2022 :ధ్వజారోహణం(మేష లగ్నం) పెద్దశేష వాహనం
02-03-2022 :చిన్నశేష వాహనం హంస వాహనం
03-03-2022 :సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
04-03-2022 :కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
05-03-2022 : పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
06-03-2022: హనుమంత వాహనం గజ వాహనం
07-03-2022 : సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
08-03-2022 : రథోత్సవం అశ్వవాహనం
09-03-2022 : చక్రస్నానం ధ్వజావరోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు.
Also Read: