APSRTC-Shivaratri: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. శివరాత్రికి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు..

APSRTC: మార్చి 1వ తేదీ మహాశివరాత్రి(Mahashivaratri) పండగను పురష్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ శివయ్య భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.  మహాశివరాత్రి దృష్ట్యా  పలు శివ క్షేత్రాలకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నదని..

APSRTC-Shivaratri: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. శివరాత్రికి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు..
Ap S Rtc
Follow us

|

Updated on: Feb 25, 2022 | 7:17 PM

APSRTC: మార్చి 1వ తేదీ మహాశివరాత్రి(Mahashivaratri) పండగను పురష్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ శివయ్య భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.  మహాశివరాత్రి దృష్ట్యా  పలు శివ క్షేత్రాలకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నదని ఆర్టీసీ ఎండి ద్వారకాతిరుమల రావు(RTC MD Dwarakatirumala Rao) చెప్పారు.  96 శైవ క్షేత్రాలకు 3225 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాదు ఇలా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయమని ప్రకటించారు.  మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి .. ఇబ్బందులు తలెత్తకుండా బస్సులను నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా శ్రీశైలం, కోటప్ప కొండా సహా ఇతర శైవక్షత్రాలకు ప్రత్యేక బస్సులను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.   భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న చోట త్రాగునీరు మౌలిక వసతులు కల్పించనున్నమని చెప్పారు. ప్రయాణికులందరూ కోవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ద్వారకాతిరుమల రావు సూచించారు.

Also Read:

ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత.. రష్యాకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల ఆందోళన

మరోసారి పుష్పరాజ్‌గా మారిన డేవిడ్‌ వార్నర్ మామ.. నెట్టింట వీడియో వైరల్

 యముడికి హయ్ చెప్పి వచ్చిన యువకుడు.. చావుకు ఎదురెళ్లిన ఘనుడు… షాకింగ్ వీడియో..

భాగ్యనగరంలో ఆ మూడు రోజులు ఇంటింటికి బూస్టర్ డోసు బంద్.. ఎందుకంటే..