Viral Video: యముడికి హయ్ చెప్పి వచ్చిన యువకుడు.. చావుకు ఎదురెళ్లిన ఘనుడు… షాకింగ్ వీడియో..
పర్వతాలను అధిరోహించడమంటే ప్రాణాలను ఫణంగా పెట్టడమే. అయినా కానీ.. కొండల్లో విహరించడం.. మంచు పర్వతాలను అధిరోహించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.

పర్వతాలను అధిరోహించడమంటే ప్రాణాలను ఫణంగా పెట్టడమే. అయినా కానీ.. కొండల్లో విహరించడం.. మంచు పర్వతాలను అధిరోహించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఎంతటి ప్రమాదకరమైన మంచు పర్వతాలను ఎక్కడానికి ఏమాత్రం భయపడరు. మంచు పర్వతాన్ని ఎక్కుతున్న సమయంలో కొన్ని సార్లు వారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతుంటాయి. ఇప్పటివరకు మంచు పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు..లేదా ప్రాణాలు కోల్పోయారు అనే వార్తలు చూసింటాం.. కానీ పర్వతాన్ని ఎక్కే సమయంలో వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోంటారు అనేది చూడలేదు కదా.. కానీ ఓ పర్వతాధిరోహకుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఆ యువకుడు చావుకు ఎదురెళ్లాడు.. ఎక్కడ.. ఎంటీ అనేది తెలుసుకుందామా..
కొలరాడోకు చెందిన లేలాండ్ నిస్కీ ఫిబ్రవరి 8న ఒరేలోని ది రిబ్బన్ పర్వత శిఖరాన్ని ఒంటరిగా అధిరోహిస్తున్నాడు. అతను భూమి నుంచి 400 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఒక్కసారిగా హిమపాతం భారిన పడ్డాడు. క్రమంగా ఆ హిమపాతం ఉదృతి పెరుగుతూనే ఉంది. అయితే అతను ఏమాత్రం భయపడకుండా.. తన వద్ద ఉన్న సాధానాలతో ఆ పర్వతాన్ని తవ్వి పట్టుకున్నాడు. హిమపాతం క్రమంగా వేగం పెరుగుతున్నా.. ధైర్యాన్న కోల్పోకుండా.. చివరి వరకు అలాగే పట్టుకోని ఉన్నాడు. చివరకు అతను తన చావును జయించి ఆ హిమపాతం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఆ హిమపాతం దాదాపు రెండు నిమిషాల వరకు కొనసాగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Bheemla Nayak Review: సమ్మర్ సినిమాలకు శుభారంభం.. భీమ్లా నాయక్.. పర్‌ఫెక్ట్ మూవీ రివ్యూ..
Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్.. ఏమన్నారంటే..
Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా